తాకరాని చోట తాకేవాడు..లైంగికంగా వేధిస్తున్న తండ్రిని చంపేసిన కుమార్తెలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఎక్కడో ఒక చోట తాకుతూ…అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. చేష్టలు మరింత అధికమయ్యాయి. చివరకు లైంగికంగా వేధించిన తండ్రిని హతమార్చారు కుమార్తెలు. తల్లి లేని లోటు..కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఈ విధంగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేకపోయారు.

ఆత్మరక్షణ కోసం ఆ కామాంధ తండ్రిని అంతమొందించారని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది.

జగద్గిరిగుట్టలో నివాసం ఉండే..ఓ వ్యక్తి (45) భార్య, ఇద్దరు (16, 17) కుమార్తెలతో నివాసం ఉండేవాడు. సంవత్సరం క్రితం భార్య చనిపోయింది. పిల్లలతోనే నివాసం ఉంటున్నాడు. ఎలాంటి కష్టం రాకుండా..చూడాల్సిన ఆ తండ్రి కన్న పిల్లలపైనే కన్నేశాడు.

తాగుడుకు బానిసైన…ఆ తండ్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది తట్టుకోలేక పోయారు కుమార్తెలు. వారిలో వారే కుమిలిపోయారు. సోమవారం రాత్రి వారిని లైంగికంగా వేధించాడు.

ఆ కబంధ హస్తాల నుంచి తప్పించుకొనేందుకు అపరకాళిలా మారిపోయారు. తిరగబడ్డ బాలికలు అతడి గొంతును తాడుతో బిగించారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన..అతడు చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు. అతని మరింత బరితెగించడంతో కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలికలు తండ్రిని చంపేశారని స్థానికులు వెల్లడిస్తున్నారు.

Related Posts