david warner floats in the air in new tiktok video

ఇలా చేస్తారా..అయితే చూపించండి – డేవిడ్ వార్న‌ర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

క‌రోనా వైర‌స్ తో లాక్ డౌన్ తో అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కానీ కొన్ని దేశాలు స‌డ‌లింపులు ఇచ్చాయి. అయితే..వివిధ రంగాల‌కు చెందిన వారు మాత్రం ఇంకా ఇళ్ల‌లోనే ఉండిపోతున్నారు. అందులో క్రికెట్ ఒక‌టి. టైం పాస్ కోసం టిక్ టాక్ లు, ఇత‌ర వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వ‌దులుతున్నారు.

వీటిని చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్న‌ర్ రిలీజ్ చేస్తున్న టిక్ టాక్ వీడియోలు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్నాయి. ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి పాట‌ల‌కు డ్యాన్స్ లు చేసి వావ్ అనిపించుకున్నాడు.

తాజాగా ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో విడుద‌ల చేశాడు. కొద్ది క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతోంది. ఎందుకంటే గాలిలో తేలుతున్న వార్న‌ర్ చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎడ‌మ చేతిని కింద ఉంచి..శ‌రీరం మొత్తం గాలిలో ఉంచాడు. ఎలాంటి స‌పోర్టు క‌నిపించ‌డం లేదు.

కొద్ది స‌మ‌యం త‌ర్వాత‌..మ‌రో చేయి కూడా పైకి లేపాడు..అంటే..మొత్తం శ‌రీరం గాలిలో తేలుతోంది. బ్యాక్ గ్రౌండ్ లో ఓ సంగీతం వినిపిస్తుండ‌గా ఇది చేశాడు. మీరు దీనిని చేయాల‌ని అనుకుంటున్నారా..చూపించండి..అంటూ క్యాప్ష‌న్ లో రాసుకొచ్చాడు. 

అల వైకుంఠపురంలో మూవీలోని బుట్ట బొమ్మ, రాములో రాములో సాంగ్ కి తన భార్యతో కలిసి స్టెప్స్ వేసి అలరించిన‌ వార్నర్.. పోకిరి సినిమాలో మహేష్ డైలాగ్ చెప్పి అద‌ర‌హో అనిపించాడు. అంతే కాదు..ప్రభుదేవా ఎవర్ గ్రీన్ ముక్కాల ముక్కాబుల సాంగ్ కి భార్యతో కలిసి డాన్స్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Wish you could do this?? Show me ?? #magic #levitate #loca #fun @yyhsofficial

A post shared by David Warner (@davidwarner31) on

Related Posts