లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సిక్సు కొడితే బీరు గ్లాసులో పడింది.. బీర్ తాగాకే బంతి ఇచ్చాడు

Published

on

Six land in Beer Mug: దేశీవాలీ లీగ్‌లలో క్రేజీ మూమెంట్స్ చూస్తూనే ఉంటాం. మ్యాచ్ వరకూ ఓకే.. అంతకుమించి జరిగితే మరింత ఇంట్రస్టింగ్ గా ఉంటుంది కదా. బ్యాట్ తో కొడితే బౌండరీ అవతల పార్కింగ్ లో ఉన్న కార్ల అద్దాలు పగిలిన సందర్భాలకు మాదిరిగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్‌బాష్‌ లీగ్-10వ సీజన్‌ లో మరో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

డేవిడ్ మలాన్ అనే ఇంగ్లీష్ క్రికెటర్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి సిక్సు బౌండరీ అవతల పడింది. బంతి ఎక్కడుందో అని వెతుకుతున్న ఫీలర్‌కు అది ఒక అభిమాని తాగుతున్న బీర్‌ కప్‌లో పడినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. గ్లాసు ఒలకబోసి బాల్ ఇవ్వమని అంటే నో చెప్పి బీర్ తాగాకే బంతి తీసి ఇచ్చాడు.

ఆ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే:
జనవరి 2 శనివారం హోబర్ట్‌ హరికేన్స్‌-మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఇది జరిగింది. విషయంలోకి వెళితే.. హోబర్ట్‌ హరికేన్స్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 పరుగులు బాదేశాడు. అతని హిట్టింగ్‌లోనే ఓ సిక్స్‌ ఫ్యాన్‌ బీర్‌ మగ్‌లో పడింది.

మెల్‌బోర్న్‌ స్టార్స్‌ బౌలర్‌ లాన్స్‌ మోరిస్‌ వేసిన 16వ ఓ‍వర్‌లో బంతిని మలాన్‌ భారీ షాట్‌ ఆడాడు. స్వేర్‌ లెగ్‌ మీదుగా లాఫ్టెడ్‌ స్ట్రోక్‌ ఆడాడు. గ్యాలరీలోకి దూసుకొచ్చిన ఆ బంతిని పట్టుకోవడానికి ఫ్యాన్స్‌ పోటీ పడగా అది కాస్తా వెళ్లి బీర్‌ మగ్‌లో​ పడింది. కామెంటేటర్లతో పాటు కూర్చొన్న అభిమానుల్ని కూడా అలరించింది.

ఈ మ్యాచ్‌లో హరికేన్స్‌ జట్టు 21 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హరికేన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.