Dawood Ibrahim and LeT planning Mumbai-like terror attack against India, Intel inputs claim

భారత్ లో 26/11తరహా ఉగ్ర దాడులకు దావుద్ ఇబ్రహీం,LeT ఫ్లాన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పాకిస్తాన్ కు చెందిన ఉగ్రసంస్థ లష్కర్-ఈ-తోయిబా(LeT),అండవరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కలిసికట్టడుగా భారత గడ్డపై 26/11తరహా దాడులను చేయాలని ఫ్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆదివారం(మే-10,2020)దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని తన ఫాంహౌస్ లో కనిపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దావుద్ ఇబ్రహీం ఫాంహౌస్ పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ నివాసం పక్కనే ఉన్నట్లు సమాచారం.

పాక్ గూఢచర్య సంస్థ ISI(ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)టీమ్ తో కలిసి లష్కర్ ఈ తోయిబా లీడర్లను కలిసేందుకు దావుద్ ఇబ్రహీం వెళ్లినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దావుద్ తో భారత్ లో దాడులకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు LeT ముఖ్యసభ్యుడు అబ్దుల్ రెహమాన్ మక్కీ ఇటీవల కరాచీ వెళ్లినట్లు తెలిపారు. సముద్రమార్గం గుండా గుజరాత్ లేదా మహారాష్ట్రకు ఆయుధాలను పంపాలని LeT ఫ్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

లష్కర్-పాక్ ఆర్మీ-గూఢచర్య సంస్థ ISI మరియు LTTE(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈలం) కనెక్షన్ కొత్తదేమీ కాదన్న విషయం తెలిసిందే. LTTE ఆదాయ మార్గం పూర్తిగా పాకిస్తాన్ కంట్రోల్ లో ఉన్న డ్రగ్స్ అన్న విషయం తెలిసిందే. గ్లోబల్ అథారిటీస్ కరోనా మహమ్మారిని డీల్ చేయడంలో బిజీగా ఉన్న సమయంలో భారత్ లో బాంబుదాడులు చేయాలని ISI ఫ్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

1993 ముంబై వరుస బాంబుపేలుళ్ల తర్వాత టెర్రరిస్ట్ దావుద్ ఇబ్రహీం భారత్ నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. తలపై 25మిలియన్ డాలర్ల రివార్డుతో ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్న దావుద్ ఇబ్రహీం కొన్నేళ్లుగా పాక్ లోనే తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆల్ ఖైదా ఉగ్రసంస్థతో కూడా దావుద్ కి సన్నిహిత సంబంధాలున్నట్లు అమెరికా గుర్తించింది. దావుద్ ని అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసింది.

Related Tags :

Related Posts :