లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు…దావూద్ హస్తం ఉందన్న NIA

Published

on

Dawood Link Suspected In Kerala Gold Smuggling సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్టుగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)భావిస్తోంది. ఈ మేరకు బుధవారం కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానంకి NIA తెలియజేసింది. ఈ కేసులో నిందితుడు రమీజ్ కి బెయిల్ ఇవ్వొద్దని కోరుతూ….గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో దేశ వ్యతిరేక మరియు ఉగ్ర కార్యకలాపాలు జరిగినట్లు NIA కోర్టుకి తెలిపింది.

తన వ్యాఖ్యలకు మద్దతుగా… భారత్ లోని ఎకనామిక్ ఏజెన్సీలకు టాప్ ఇంటిలిజెన్స్ బాడీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటిలిజెన్స్ బ్యూరో(CEIB) ఇచ్చిన రిపోర్ట్ ను NIA ప్రస్తావించింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వరాదని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పలుమార్లు దావూద్ ఇబ్రహీం విస్తృతమైన టాంజానియా వెళ్లివచ్చాడని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న ఏ-5 రమీజ్‌ను విచారించినప్పుడు అతను పలు విషయాలను వెల్లడించాడు. టాంజానియాలో తనకు డైమండ్ బిజినెస్ ఉన్నట్లు రమీజ్ తెలిపాడు. టాంజానియా నుంచి బంగారం తెచ్చి యూఏఈలో అమ్మినట్టు వెల్లడించాడు అని ఎన్‌ఐఏ తెలిపింది.

మహమ్మద్ షఫీ అనే వ్యక్తి ఈ బంగారం అక్రమ రవాణాలో ప్రధాన సూత్రదారుడిగా ఉన్నాడని.. రమీజ్‌తో కలిసి 2019 నవంబర్ నుంచి ఈ విధంగా అక్రమణ రవాణాకు పాల్పడుతున్నాడని తెలిపింది. వీరు UAE కాన్సులేట్ యొక్క నకిలీ పత్రాలను ఉపయోగించి దౌత్య మార్గాల ద్వారా 21 సార్లు బంగారం అక్రమంగా తరలించారని పేర్కొంది.అసలేంటీ కేసు

జూలై 5 న తిరువనంతపురం విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు… UAE కాన్సులేట్ కార్యాలయానికి ఉద్దేశించిన పార్శిళ్లలో 13.5 కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. డిప్లమాటిక్ కార్గో ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బంగారం తరలించడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఏ, కస్టమ్స్, ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్‌లు విడివిడిగా విచారణ చేపట్టాయి.

ఈ కేసుకు సంబంధించి తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేటులో మాజీ ఉద్యోగులైన స్వప్న సురేష్‌, పీఎస్ సరిత్‌తో పాటు మరికొందరు నిందితులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అయితే ఈ కేసులో స్వప్న సురేష్ పేరు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధాన కార్యదర్శికి ఎం శివశంకర్‌కు ఆమెతో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక, ఇటీవల ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ.. పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తికానందున్న ఆమె విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ( NIA)… గోల్డ్‌ స్మగ్లింగ్‌ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని తెలిపింది.


గోల్డ్ స్మగ్లింగ్ లో కీలక పాత్రధారి.. స్వప్నా సురేష్
అబుదాబిలో తన తన తండ్రికి చెందిన చిన్న-కాల వ్యాపారాలను నిర్వహించడానికి స్వప్నా సురేష్ సహాయం చేస్తుండేది. ఆమె వ్యక్తిగత జీవితం దుబాయ్ వ్యాపారవేత్తతో స్వల్పకాలిక వివాహంతో నిర్ణయాత్మక మలుపు తీసుకుంది. 2000 ప్రారంభంలో, భర్తకు విడాకులిచ్చి ఆమె తన సొంత జిల్లా తిరువనంతపురానికి వెళ్ళింది. అక్కడ ఆమె అనేక ట్రావెల్ ఏజెన్సీలలో పనిచేస్తూ 10 సంవత్సరాలు గడిపింది. ఆ కాలంలో బంగారాన్ని తీసుకెళ్లే పనిలో నిమగ్నమైన వారితో ఆమె పరిచయాలను పెంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిన్న వయసులో పెళ్లి అయినప్పుడు పుట్టిన కుమార్తెను పెంచింది. స్వప్న సురేష్ కూతురు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి. కొన్ని సంవత్సరాల క్రితం స్వప్న సురేష్ రెండో పెళ్లి చేసుకుంది. స్వప్నకు ఇప్పుడు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

2013 లో ఎయిర్ ఇండియా SATS(గ్రౌండ్ హ్యాండ్లింగ్ విభాగం) ‌లో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరినప్పుడు ఆమె సమర్పించినవి నకిలీ బి.కామ్ సర్టిఫికేట్ అని ఇన్వెస్టిగేటర్స్ పేర్కొన్నారు. 2016 లో, ఆమె రాష్ట్ర రాజధానిలోని యుఎఈ కాన్సులేట్-జనరల్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి బైబై చెప్పి.. కేరళ ప్రభుత్వానికి ప్రధాన కన్సల్టెంట్ అయిన ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ తరపున,ప్లేస్‌మెంట్ ఏజెన్సీ… విజన్ టెక్నాలజీ చేత షార్ట్‌లిస్ట్ చేయబడడానికి ఆమె నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ను ఉపయోగించారని దర్యాప్తు అధికారులు తెలిపారు.కేరళ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో ఆమెను స్పేస్ పార్క్ ఆపరేషన్స్ మేనేజర్‌గా నియమించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ టి కార్యదర్శి ఎం. శివశంకర్ … స్వప్న సురేష్ కు ఈ పోస్టింగ్ రావడంలో సహాయం చేసారని ఆరోపణలు ఉన్నాయి. అతను ప్రస్తుతం రెండు పోస్టుల నుండి తొలగించబడ్డాడు. కేరళ చీఫ్ సెక్రటరీ విశ్వస్ మెహతా నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల కమిటీ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినందుకు శివశంకర్ ని దోషిగా తేల్చింది. KSITIL లో స్వప్న నియామకానికి శివశంకర్ సిఫారసు చేసినట్లు కూడా తేలింది. ఇప్పటివరకు, ఆమె రెండు జీవితాలను నడిపించిందని ఆరోపించబడింది. ఒకటి పవర్ బ్రోకర్‌గా వెలుగులో,బంగారం అక్రమ రవాణాకు పాల్పడే వారితో చేతులు కలిపి మరొకటి చీకటిలో.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *