వేలానికి దావూద్ ఇబ్రహీం ఆస్తులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Dawood Ibrahim’s 7 Maharashtra properties భారత్ తో సహా ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన అండర్​ వరల్డ్​ డాన్​, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్​ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి వేయనున్నారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్(SAFEMA) కింద..మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్​ తాలుకాలోని ముంబ్కే గ్రామంలోని దావూద్​ ఇబ్రహీంకు చెందిన ఏడు ప్రాపర్టీలను నవంబర్-10న వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో వేలం ప్రక్రియ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా,ఆస్తుల వేల్యువేషన్​ ప్రక్రియ గతేడాదే ముగిసిన విషయం తెలిసిందే.రత్నగిరి జిల్లా ఖేడ్​ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్​ పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్​కు స్థిరాస్తులు ఉన్నాయి. ఖేడ్​లోని విలువైన ఆస్తులు అతడి సోదరి హసినా పార్కర్ పేరు మీద​, మిగిలినవి తల్లి అమినా పేరు మీద ఉన్నాయి.

1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్​ కుటుంబసభ్యులు నివాసముండేవారు. దీనిని దావూద్​ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద ఆస్తి రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దీనిని దావుద్​ కుటుంబసభ్యులు విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్తకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితికి నెలకొంది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్​ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ రూ. కోటి.(క్యుములేటివ్​ వాల్యూ).కాగా, 1993 ముంబై వరస పేలుళ్లు తర్వాత దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు దావూద్. పాకిస్థాన్ లో దావూద్ ఉన్నట్లు ఇటీవల పాక్ ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.

Related Posts