విజయవాడలో పట్టపగలే భారీ దోపిడీ….రూ. 50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది.

మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మానస అపార్ట్మెంట్ లో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మురళీధర్ నివాసంలో చోరీ జరిగింది.డాక్టర్ మురళీధర్ ఇంట్లోకి సాయంత్రం సమయంలో ప్రవేశించిన నలుగురు దుండగులు చంపేస్తామని బెదిరించి…. డాక్టర్ భార్య,కుమారుడిని తాళ్లతో కట్టేసారు. అనంతరం ఇంట్లో విలువైన బంగారం ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు దోచుకు వెళ్లిపోయారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.

క్లూస్ టీం ను, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపిన పోలీసులు గాలింపు చేపట్టారు. దుండగులు ముఖానికి మాస్క్ లు, గ్లౌజులు ధరించి నట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి పరిశీలిస్తున్నారు. అని చెక్ పోస్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. నగర పోలీసు కమీషనర్ శ్రీనివాసులు ఘటనా స్ధలాన్ని సందర్సించారు.


Related Posts