National
దేశమంతా దిశ చట్టం కోసం దీక్ష చేస్తున్న స్వాతి ఆసుపత్రికి తరలింపు
అత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను
Home » దేశమంతా దిశ చట్టం కోసం దీక్ష చేస్తున్న స్వాతి ఆసుపత్రికి తరలింపు
అత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను
Published
1 year agoon
By
veegamteamఅత్యాచార నిందితులకు 6 నెలల్లోగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెను
దేశవ్యాప్తంగా దిశ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే స్వాతిని లోక్ నాయక్ హాస్పిటల్ కి(ఎల్ఎన్ జేపీ) తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుండటంతో.. స్వాతి ఆరోగ్యం క్షీణించింది. అత్యాచార నిందితులకు 6 నెల్లలో ఉరిశిక్ష విధించాలని స్వాతి డిమాండ్ చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్రం తీసుకుంటున్న చర్యలను స్వాతి మాలివాల్ తప్పుబట్టారు. దేశమంతా దిశ చట్టం తీసుకొచ్చే వరకు నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
కాగా, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చెయ్యాలని కోరుతూ ప్రధాని మోడీకి స్వాతి మాలివాల్ లేఖ రాశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఏపీ సర్కార్ తెచ్చిన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఏపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ చట్టం ప్రకారం.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే, 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవితఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు. ఇలా చట్టాన్ని తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలని…ప్రధానికి రాసిన లేఖలో స్వాతి అభ్యర్ధించారు. మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. 13రోజులుగా దీక్ష చేస్తున్నారు.
యాసిడ్ దాడులు, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాటిని విచారించాలనేది దిశ చట్టం ముఖ్యమైన ఉద్ధేశ్యం. కచ్చితమైన ఆధారాలు ఉంటే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది.