లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

దిశ నిందితుల మృతదేహాలు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Published

on

dead bodies of the disha accused were shifted to Mahabubnagar government hospital

దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం, భారీ పోలీస్ బందోబస్తు నడుమ తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో డాక్టర్ల బృందం నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాలను నేరుగా వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆప్పత్రి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులను మోహరించారు.మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 

దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించారు. ఫారూఖ్ నగర్ తహశీల్దార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. దేశవ్యాప్తంగా దిశపై హత్యాచారం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఘటన అనంతరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

బుధవారం అర్ధరాత్రి దాటాకా నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి పోలీసులు ఘటనా స్థలానికి రహస్యంగా తరలించారు.  తొండుపల్లి టోల్ గేట్ ప్రాంతంలో నిందితులు లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలించారు. నిందితులు భూమిలో పాతిపెట్టిన దిశ మొబైల్‌ను వారితోనే వెలికి తీయించారు. ఘటన రోజు ఏం జరిగిందో మొత్తం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు.

(నవంబర్ 27, 2019) దిశను నిందితులు అత్యాచారం చేసి కాల్చి చంపారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దిశ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసుకోవచ్చంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేసులో సత్వర విచారణ చేపట్టి నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడుతుందని భావించారు. 
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *