ఆఫ్గనిస్తాన్ లో కారు బాంబు పేలి 16మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Deadly car bomb attack in Afghanistan ఆఫ్గానిస్థాన్ ​లో కారు బాంబు పేలి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఘోర్​ రాష్ట్ర రాజధాని ఫిరోజ్ కోహ్ లో ఆఫ్గాన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 16 మంది మరణించగా…100మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయాలపాలైన డజన్ల కొద్ది మందికి ఘోర్ లోని ఓ హాస్పిటల్ అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.బాధితుల్లో కొందరు సెక్యూరిటీ ఫోరెస్స్ కూడా ఉన్నట్లు ఘోర్​ ఆరోగ్య అధికారి జుమా గుల్ యాకూబి తెలిపారు. ఈ బాంబు చాలా పవర్ పుల్ అని ఘోర్​ గవర్నర్ తెలిపారు. బాంబు పేలుడు ధాటికి దగ్గర్లోని కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. ఆయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు ఇంత వరకు ప్రకటన చేయలేదు.

కాగా, గత నెలలో ఖతార్‌ లో అమెరికా ఆధ్వర్యంలో తాలిబాన్ మరియు ఆఫ్గన్ ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కాని హింస మాత్రం కొనసాగుతూనే ఉంది. చర్చలకు ప్రాథమిక చట్రాన్ని ఏర్పాటు చేయడానికి తాలిబాన్ మరియు ఆఫ్గన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం శాంతి చర్చలు నిలిచిపోయినట్లు కనిపిస్తోంది.మరోవైపు, ఫిబ్రవరిలో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం ప్రకారం అన్ని రకాల దాడులు, రాత్రి దాడులు నిలిపివేస్తామని అమెరికా ప్రకటించిన తర్వాత ఇవాళ కారు బాంబు దాడి జరగటం గమనార్హం. హెల్మండ్ ప్రావిన్స్ లో తాలిబాన్ దాడులను తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తున్న ఆఫ్గన్ దళాలకు మద్దతుగా అమెరికా వైమానిక దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలను అరికట్టే ప్రమాదం ఉంది.

అయితే, దక్షిణ అఫ్గానిస్థాన్​లో దాడులను ఆపేసేందుకు తాలిబన్లు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఇటీవల కాలంలో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌ లోని వేలాదిమంది నివాసితులను తాలిబన్లు వేరే చోట్లకి తరలించిన విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :