లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులపై టీఆర్‌ఎస్‌లో జోరుగా చర్చ

Published

on

TRS mayor and deputy mayor : గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరనే చర్చ మొదలైంది. జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో మేయర్ పీఠం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. అటు బీజేపీ బలమైన ప్రతిపక్షంగా మారిన నేపథ్యంలో.. ధీటైన సమాధానం చెప్పగల అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది.గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీని నిరాశపరిచినా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు మాత్రం గులాబీ పార్టీ ఖాతాలోనే పడనున్నాయి. ప్రస్తుత పాలకమండలి మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈలోగా కీలక పదవుల ఎన్నిక నిర్వహణకు ప్రత్యేక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేయాల్సి ఉంది.అతిపెద్ద పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ నేతలకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో గులాబీ పార్టీలో ఆ పదవి దక్కించుకునే నేతలు ఎవరన్న చర్చ మొదలైంది. జనరల్ మహిళకు మేయర్ స్థానం రిజర్వు కావడం, మేయర్ పదవి కోసం పోటీపడిన మహిళా నేతలంతా విజయం సాధించడం ఉత్కంఠ రేపుతోంది. వారిలో ఎవరిని అదృష్టం వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి మేయర్ పదవి రేస్‌లో పలువురు టీఆర్ఎస్ మహిళా నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. జనరల్ మహిళ స్థానంలో ఓసిలకు పదవి దక్కుతుందా? లేక బీసీ లకు మేయర్ పదవి దక్కనుందా అన్న అంశాలపై పార్టీ నేతల్లో భిన్న వాదనలు ఉన్నాయి. అగ్రవర్ణాలకు మేయర్ పదవి దక్కితే.. భారతి నగర్ నుంచి విజయం సాధించిన సింధూ ఆదర్శ రెడ్డి, వివేకానంద నగర్ స్థానం నుంచి గెలిచిన మాధవరం రోజా రావు, అల్వాల్ నుంచి ఎన్నికైన చింతల శాంతి, ఖైరతాబాద్ నుంచి ఎన్నికైన విజయ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.ఒక వేళ బీసీ మహిళకి మేయర్ పదవి దక్కే అవకాశాలు ఉంటే టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి, బొంతు శ్రీదేవిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ పదవి మహిళలకే అవకాశం ఇస్తారా పురుషులకు చాన్స్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.సామాజిక సమీకరణాల నేపథ్యంలో అగ్రవర్ణాలకు మేయర్ పదవి కట్టబెడితే.. బీసీలకు డిప్యూటీ మేయర్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాల్సి వస్తే… మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో ఎంఐఎం ఎలాంటి షరతులు పెడుతుందనేది ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *