గుడ్ న్యూస్, డిసెంబర్ 3 నాటికి భారత్‌లో కరోనా అంతం, ఇండియా ఔట్ బ్రేక్ నివేదిక

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విశ్వరూపం చూపిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దేశంలో శర వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కేసుల సంఖ్య 29 లక్షల మార్క్ దాటింది.

ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? అనే ఆందోళన ప్రజల్లో నెలకొన్న వేళ, టైమ్స్ ఫ్యాక్ట్-ఇండియా అవుట్ బ్రేక్ నివేదిక(IOR) చెబుతున్న విషయాలు ఊరట కలిగించేలా ఉన్నాయి. ఇంతకీ ఆ నివేదిక ఏం చెబుతోందంటే..సెప్టెంబర్ 2 నాటికి దేశంలో పతాకస్థాయికి కరోనా కేసులు:
డిసెంబర్ 3 నాటికి భారత్ లో కరోనా అంతం అవుతుందని ఐఓఆర్ వెల్లడించింది. డిసెంబర్ మొదటి వారంలో వైరస్ వెనుతిరిగే దశలో ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ తొలి వారానికి కొవిడ్ కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుతుందని అంచనా వేసిన ఈ రిపోర్టు, ఆ సమయానికి యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 7.80 లక్షల వరకూ ఉంటుందని చెప్పింది.

అప్పట్నుంచీ సెప్టెంబర్ 16 దాకా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చి.. డిసెంబర్ మొదటివారం నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపింది.

సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో తీవ్ర స్థాయి:
సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో వైరస్ అత్యధిక స్థాయిలో ఉంటుందని, ఆ తర్వాత మరో 15 రోజులకు వైరస్ కరోనా హాట్ స్పాట్స్ నుంచి కూడా మాయం కావడం ప్రారంభమవుతుందని రిపోర్టులో తెలిపింది. వైరస్ వ్యాప్తి తొలి దశలో ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కేసుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండి కూడా, ఇప్పుడు తగ్గిన నేపథ్యంలో, ఐఓఆర్ అంచనాలు ఆశలను పెంచుతున్నాయి. ఢిల్లీలో 58లక్షల మందిలో కరోనా యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని ఇటీవల కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.నవంబర్ కల్లా ముంబై, బెంగళూరు.. అక్టోబర్ నాటికి చెన్నైలో కరోనా తగ్గుముఖం:
వైరస్ ను ఎదుర్కొనే శక్తి భారతీయుల్లో పెరుగుతోందని, నవంబర్ కల్లా ముంబై నగరం కరోనా నుంచి బయట పడవచ్చని, చెన్నైలో అక్టోబర్ చివరి నుంచి వ్యాధి తగ్గుముఖం పడుతుందని ఈ తాజా నివేదిక చెబుతోంది.

ఆగస్ట్ నెలాఖరుకు బెంగళూరులో కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకుంటుందని, ఆపై నవంబర్ రెండో వారం తరువాత తగ్గుముఖం కనిపిస్తుందని వెల్లడించింది. మహా నగరాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ, పట్టణాలు, గ్రామాల్లో పెరుగుతున్నందున, ఇకపై మధ్య, చిన్న శ్రేణి పట్టణాలపై ప్రభుత్వాలు దృష్టిని సారించాలని సూచించింది.

READ  తల్లి పాల బలం : కరోనాను జయించిన 3 నెలల బాలుడు

సూరత్, జైపూర్, నాసిక్ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేసిన ఐఓఆర్, నవంబర్ మూడో వారం నుంచి ఈ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని, ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తున్న రేటు కూడా తగ్గుతోందని గుర్తు చేసింది. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి రేటు 1.24కు చేరిందని, తెలంగాణలోనూ ఇవే సంకేతాలు కనిపిస్తుండటం వైరస్ నుంచి భారత్ బయట పడనున్నదన్న బలమైన సంకేతాలను పంపుతోందని చెప్పింది.ఏపీలో అక్టోబర్ 28నాటికి, తెలంగాణ అక్టోబర్ 17నాటికి పూర్తిగా కరోనా అంతం:
సెప్టెంబర్ 2 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య గరిష్టానికి చేరితే, ఏపీలో ఆగస్టు 23 నాటికి పతాకస్థాయికి కరోనా కేసులు చేరుకోవచ్చని, ఆ తర్వాత నెమ్మదించి అక్టోబర్ 28నాటికి తగ్గుముఖం పట్టొచ్చని ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్టు అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆగస్టు 15 నాటికే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుకుందని, అక్టోబర్ 17 నాటికి పూర్తిగా కరోనా అంతం కావొచ్చంది. మొత్తంగా భారత్ లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం అవుతుందని నివేదికలో స్పష్టం చేసింది.

ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌ లో జరిగిందే భారత్ లోనూ జరగబోతోంది:
వేలు, లక్షల సంఖ్యలో నమోదైన కేసుల ఒత్తిడితో.. ఆస్పత్రులు సరిపోక.. సతమతమైన ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌ తదితర దేశాల్లో కూడా ఇలాగే కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఒక దశలో పతాకస్థాయికి చేరి అక్కణ్నుంచి తగ్గుముఖం పట్టింది. అదే దశ మన దేశంలో కూడా త్వరలోనే రాబోతోందని ‘టైమ్స్‌ ఫ్యాక్ట్‌ ఇండియా అవుట్‌ బ్రేక్‌ రిపోర్ట్‌’ అంచనా వేసింది.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ శాస్త్రజ్ఞలు వేసిన అంచనాలు అందరిలోనూ ఆనందం నింపాయి. అది నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు.


Related Posts