రైలు ప్రయాణాలు అంత సేఫేం కాదు, రెండు గంటలు దాటితే.. కరోనా ముప్పు ఎక్కువ!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రైల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. కరోనా ముప్పు పొంచి ఉంది.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంతవరకు ఎలాంటి దూర ప్రయాణాలను చేయొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. రైలు వంటి ప్రయాణికుల్లో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందని సైంటిస్టులు సైతం హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ఒక మీటర్ కంటే ఎక్కువ సామాజిక దూరాన్ని పాటించాలనేది నియమం.. కానీ, ఇలాంటి ప్రయాణాల్లో అది సాధ్యపడదని అంటున్నారు. ప్రయాణ దూరంలో ఎక్కువ గంటలు గడిచేకొద్ది కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి రైల్లో ప్రయాణిస్తే.. ఆ వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తులకు తొందరగా వైరస్ సోకే అవకాశం ఉందని సైంటిస్టులు తేల్చేశారు.కరోనా వ్యక్తితో కలిసి ప్రయాణించే ఒక గంటకు ఒకటి మీటర్ కంటే ఎక్కువ సురక్షితమైన సామాజిక దూరం అవసరమని కనుగొన్నారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌తో సహా పరిశోధకులు చైనాలోని హై-స్పీడ్ రైలు మార్గాలను అంచనా వేశారు. రైలు ప్రయాణాల్లో రెండు గంటలు కంటే ఎక్కువ సమయం ప్రయాణిస్తే కరోనా సోకిన వ్యక్తి నుంచి ఇతర ప్రయాణికులకు వేగంగా కరోనా సోకే ముప్పు ఉందని తేల్చేశారు.

వైరస్ సోకిన వ్యక్తి కూర్చొన్న సీటు నుంచి కూర్చున్న ప్రయాణీకుల్లో జీరో నుంచి 10 శాతం మందికి సోకే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది. దీని ప్రకారం.. ఈ ‘క్లోజ్ కాంటాక్ట్’ ప్రయాణికులకు సగటు వ్యాప్తి రేటు 0.32 శాతంగా ఉందని గుర్తించారు. కరోనా ఉన్న వ్యక్తి నేరుగా ప్రక్కనే ఉన్న సీట్లలో ప్రయాణించే ప్రయాణీకులు అత్యధిక స్థాయిలో వైరస్ సోకే ముప్పు ఉందని పరిశోధకులు నిర్ధారించారు.అంటే.. సగటున 3.5 శాతం మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఒకే వరుసలో కూర్చున్న వారికి ఈ సంఖ్య 1.5 శాతంగా చెప్పారు. ప్రతి సీటుకు వైరస్ సోకే తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. COVID-19 సోకిన వ్యక్తికి ఒక సీటులో ప్రయాణికుల సంఖ్య, ఒకే సీటులో ప్రయాణించే మొత్తం ప్రయాణీకుల సంఖ్యతో పరిశోధకులు విభజించి పరిశీలించారు. సోకిన వ్యక్తి నుంచి ప్రయాణించిన ప్రతి గంటకు 0.15 శాతం పెరిగిందని అధ్యయనం గుర్తించింది.

పక్కనే ఉన్న సీట్లలో ఉన్నవారికి ఈ పెరుగుదల రేటు గంటకు 1.3 శాతంగా ఉందని గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి కూర్చొన్న సీటులో మరొకరు కూర్చుంటే వారిలో 0.075 శాతం మంది మాత్రమే ఈ వ్యాధి బారిన పడ్డారని అధ్యయనం కనుగొంది. చైనా హై-స్పీడ్ G రైలు నెట్‌వర్క్‌లోని రైల్వే ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణ, డేటాను విశ్లేషించడానికి పరిశోధనలో సైంటిస్టులు ఈ ఫార్మూలను ఫాలో అయ్యారు.

READ  Corona Lockdown: 10నెలల శిశువును ఎత్తుకుని 2రోజులు కాలి నడకన ప్రయాణంఈ డేటాలో ప్రయాణ సమయంలో COVID-19 ఉన్నవారు, వారికి దగ్గరి సంబంధాలు ఉన్నవారికి 14 రోజుల్లో కరోనా లక్షణాలు కనిపించినట్టు గుర్తించారు. సైంటిస్టుల ప్రకారం.. ఈ డేటా 19 డిసెంబర్ 2019, 2020 మార్చి 6 మధ్య కాలం నుంచి తీసుకున్నారు. ఇందులో 2,334 మంది కరోనా పేషెంట్లు, 72,093 క్లోజ్ కాంటాక్టులతో సహా ప్రయాణీకుల ప్రయాణ సమయాలు గంట నుండి 8 గంటల మధ్య ఉన్నాయి.

రైళ్ళలో COVID-19వ్యాప్తికి ఎక్కువ ప్రమాదం ఉన్నప్పటికీ.. ఒక వ్యక్తి సీటు నుంచి మరో సీటు వ్యక్తికి కరోనా సోకాలంటే వారు ప్రయాణించిన సమయంతో తీవ్ర ప్రభావం ఉంటుందా? అని సైంటిస్టులు పరిశీలించారు. COVID-19 మహమ్మారి సమయంలో ప్రయాణీకుల రద్దీని తగ్గించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చర్యలు చేపట్టేలా చూడాలి. ముఖానికి ఫేస్ ఫీల్డ్స్, మాస్క్ లు తప్పనిసరిగా వాడాలి. బోర్డింగ్‌కు ముందు టెంపరేచర్ కూడా చెకింగ్ చేయడం చాలా ముఖ్యమని ఈ అధ్యయనం సూచిస్తోంది. తనిఖీలను నిర్వహించడం చాలా ముఖ్యం అని కనుగొన్నది.కరోనా సోకిన వ్యక్తితో కలిసి ప్రయాణిస్తే.. ఒక గంటలో ఒక మీటర్ కంటే ఎక్కువ సురక్షితమైన సామాజిక దూరం అవసరమంటున్నారు. కానీ రెండు గంటల తరువాత కూడా వైరస్ నిరోధించడానికి 2.5 మీటర్లు కన్నా తక్కువ దూరం సరిపోదంటున్నారు. ఇంత కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. హై-స్పీడ్ రైళ్ళలో వారి క్లోజ్ కాంటాక్టుల నుండి వచ్చిన డేటా ఆధారంగా ప్రజా రవాణాపై COVID-19 వ్యాప్తికి వ్యక్తిగత ప్రమాదాన్ని కలిగిస్తుందని సూచిస్తోంది అధ్యయనం.

సౌతాంప్టన్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం.. వైరస్ ఉన్న వ్యక్తి నుంచి దూరమే కాదు.. వారితో కలిసి ఎంతసేపు ప్రయాణం చేశారనేది కచ్చితంగా లెక్కించాల్సి ఉందని అంటున్నారు. వైరస్ బారినపడకుండా ఉండాలంటే.. తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే కరోనా మమహ్మారి వ్యాప్తిని నియంత్రించడం సాధ్యపడుతుందని అధ్యయన పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts