deepika-kidnap-in-vikarabard

వికారాబాద్‌లో దీపిక కిడ్నాప్ కలకలం, రోడ్డుపై వెళ్తుండగా కారులో ఎత్తుకెళ్లారు, ఇది భర్త పనేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

vikarabad deepika kidnap..వికారాబాద్ జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యువతి కుటుంబసభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు.




2016లో ఆర్యసమాజ్ లో దీపిక, అఖిల్ పెళ్లి:
వికారాబాద్‌కు చెందిన దీపిక 2016లోనే అఖిల్ అనే వ్యక్తిని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకుంది. ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం దీపికను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో దీపిక, అఖిల్ కుటుంబసభ్యుల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇందుకు సంబంధించి ఇరు కుటుంబసభ్యుల మధ్య కేసు కూడా నడుస్తోంది. ఇందులో భాగంగానే మొన్న(సెప్టెంబర్ 26,2020) రెండు కుటుంబాలు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆదివారం (సెప్టెంబర్ 27,2020) సాయంత్రం దీపిక తన అక్కతో కలిసి బయటికి రావడంతో.. ఆమె భర్త కారులోనే వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

యువతి కిడ్నాపైందా? లేక భర్తనే తీసుకెళ్లాడా?
అసలు యువతి కిడ్నాపైందా? లేక భర్తనే తీసుకెళ్లాడా? అన్న అనుమానాలు తలెత్తాయి. ఒకవేళ భర్త రాకపోతే.. అతని కారులో వచ్చిన వ్యక్తులు ఎవరనే దానిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై డీఎస్పీ సంజీవరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఇరు కుటుంబసభ్యులను విచారించనున్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన పోలీసుల దీపిక కోసం గాలిస్తున్నారు. భర్త అఖిల్, దీపికను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్యభర్తలు దీపిక, అఖిల్ వేర్వేరుగా ఉంటున్నారు. నిన్న వస్త్ర దుకాణం దగ్గర రోడ్డుపై వెళ్తున్న దీపికను కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.




Related Posts