రణవీర్-దీపికాలు ప్రొడక్షన్ హౌజుల్లో బిజీబిజీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాలీవుడ్ లో హాట్ లవింగ్ పెయిర్ అంటే గుర్తొచ్చేది రణవీర్, దీపికా. ఈ హ్యాపెనింగ్ హీరోహీరోయిన్లు .. ప్రొఫెషనల్ గా యాక్టింగ్ లో బిజీగా ఉంటూనే .. పర్సనల్ గా తమ బిజినెస్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. చేతినిండా సినిమాలతో పాటు ఇప్పటికే ఉన్న ప్రొడక్షన్ హౌస్ కి తోడు మరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఫామ్ లో ఉన్నప్పుడే ఫుల్ గా సంపాదించడంలో బాగా బిజీ అవుతున్నారు ఈ స్టార్ కపుల్.

బాలీవుడ్ లో దీపికా , రణవీర్ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. కెరీర్ లో ఇప్పటికే ప్రయోగాల స్టేజ్ ని రీచ్ అయిపోయారు. అటు దీపికా ఉమెన్ ఓరియంటెడ్ సినమాలు చేస్తూ తన టాలెంట్ తో సర్‌ప్రైజ్ చేస్తుంటే ..ఇటు రణవీర్ కూడా తన లుక్ తో ప్రయోగాలు చేస్తూ.. అటు కమర్షియల్ ఇటు డిఫరెంట్ మూవీస్ చేస్తూ.. షాక్‌లు ఇస్తున్నారు.

ఇప్పటికే చాలా సినిమాల్లో క్రేజీ స్టోరీలతో హీరోగా తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న రణవీర్ .. లేటెస్ట్‌గా సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. మా కసమ్ ఫిల్మ్స్ పేరుతో తన తల్లి పేరుమీద నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు రణవీర్. మూడేళ్ల క్రితమే ఈ ప్రొడక్షన్ హౌస్ రిజిష్టర్ చేసిన రణవీర్..లేటెస్ట్ గా దీన్ని స్టార్ట్ చేశారు.

ఫన్, యూత్ ఓరియంటెడ్ మూవీస్ చెయ్యాలని ఈ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు రణవీర్. రణవీర్, దీపికా కు ఇది ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ కాదు. అంతకుముందే మ్యూజిక్ కి సంబందించి ఇంక్ ఇంక్ అనే ఫామ్ ని స్టార్ట్ చేశారు. తర్వాత భార్య దీపికా పదుకొణెతో కలిసి చాక్‌ అండ్‌ చీజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌‌ని స్టార్ట్ చేశారు. అంతే కాదు.. దీపికాకి కూడా కేఏ ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసి ఛపాక్‌ మూవీ ప్రొడ్యూస్ చేసింది.

ఈ సినిమాలో యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో అందరినీ మెప్పించింది దీపికా. నటించి అలరించింది. ఇలా భార్యా భర్తలు ఇద్దరూ కలిసి అటు ప్రొఫెషనల్ గా బిజినెస్ పరంగా ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు అనుకంటున్నారు బాలీవుడ్ జనాలు.

Related Posts