లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

దీపికా హోమ్ మేనేజ్‌మెంట్.. పనివాళ్లుండగా నువ్వెందుకు?.. రణ్‌వీర్ ప్రశ్నలు..

Updated On - 7:15 pm, Wed, 20 January 21

Deepika Padukone: బాలీవుడ్‌లో మోస్ట్ బిజియెస్ట్ స్టార్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాప్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్న దీపికా పడుకోన్ కి అసలు ఇంట్లో స్పెండ్ చేసే టైముంటుందా అనుకుంటారు అందరూ. కానీ ఈ స్టార్ హీరోయిన్ ఇంట్లో టైమ్ స్పెండ్ చెయ్యడం కాదు.. ఇంటికి సంబంధించిన సరుకులు, సామాన్లు అన్నీ తనే దగ్గరుండి మేనేజ్ చేస్తుందట. వీటితో పాటు దీపికా ఇంటిని ఎలా మేనేజ్ చేస్తుందో తెలుసా..?

దీపికా పడుకోన్ బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్‌ఫామ్‌లో ఉంది. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు విమెన్ ఓరియంటెడ్, హిస్టారికల్ మూవీస్‌తో ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లే కాదు.. అంతకన్నా బిజీగా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు ఇంటిని కూడా తనే మేనేజ్ చేస్తానని చెబుతోంది.

సరుకులు కొనడం, సర్దడం అంతేకాదు ఇంటికి సంబదించిన ప్రతీదీ ఆర్గనైజ్డ్‌గా నీట్‌గా ఉండాలని చెబుతోంది దీపికా. అందుకే లాక్‌డౌన్ పీరియడ్‌లో కూడా తన వార్డ్ రోబ్‌ని క్లీన్ చేశానంటూ పోస్ట్ పెట్టింది దీపికా. జనరల్‌గా బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్‌కి ఇంటి పనికోసం అంత టైమ్ స్పెండ్ చేసే వీలు దొరకదు. కానీ దీపికా అలా కాదు.. ప్రతీదీ తనే చూసుకుంటానంటోంది. వేరే వాళ్ల మీద ఆ రెస్పాన్సిబిలిటీ పెట్టడం కంటే.. మనమే చేసుకోవడం మంచిది అంటోంది.

ట్యాప్‌లో వాటర్ రాకపోయినా, సర్వెంట్స్ ఎవరైనా రాకపోయినా.. తనే మేనేజ్ చేస్తుంది. ఇంతమంది సర్వెంట్స్ ఉంటే నువ్వెందుకు ఇవన్నీ చేస్తావని రణ్‌వీర్ ఎప్పుడూ అంటున్నా కూడా.. దీపికా మాత్రం చిన్నప్పటి నుంచి అలాగే పెరిగానని అందుకే.. ఇప్పటికీ ఆ అలావాటును అలాగే కంటిన్యూ చేస్తున్నానంటోంది.