ఫుల్ టెన్షన్‌లో బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Deepika Padukone, Sara Ali Khan, Summoned In Drugs Probe: గోవా టూ ముంబై స్పెషల్ ఫ్లైట్‌లో దీపిక, అదే ఫ్లైట్‌లో సారా ఆలీఖాన్. బాలీవుడ్‌లో ఫ్రైడే ఏం జరగుతుంది. బాలీవుడ్ స్టార్స్‌ని అరెస్ట్ చేస్తారా? ఎంక్వైరీకి పిలిచిన రెండో రోజే రియాచక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు ఇతర తారలను కూడా అదుపులోకి తీసుకుంటారా?

శుక్రవారం ఎంక్వైరీకి పిలిచిన దీపికా పదుకోన్ కానీ సారా ఆలీ ఖాన్ , ఇద్దరూ గోవా నుంచే ముంబై చేరుకున్నారు.ఐతే రియా డ్రగ్స్ వ్యవహారంలో ముందుగా ఎన్‌సిబి అరెస్ట్ చేసిన డ్రగ్ పెడ్లర్లు గోవా నుంచే ఈ వ్యవహారం నడిపినట్లు డౌటుంది.

దీంతో గోవా టూ ముంబై డ్రగ్స్ లింకులపై కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఫోకస్ పెట్టే ఛాన్సుంది. ఎప్పట్నుంచో గోవాలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ నడుస్తుందనే సమాచారం ఉంది. అసలు బాలీవుడ్ సినిమాలు, ఫోటో షూట్లు గోవాలో పెట్టుకునేదే ఈ డ్రగ్స్ దందా కోసమన్నది పుకారు.



మరోవైపు ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్లను కూడా తన రాడార్‌లోకి తీసుకోవడమే కాకుండా, ఎంక్వైరీకి పిలవడంతో శుక్రవారం దీపికా పదుకోన్ ఏం చెప్పబోతుందన్నది నరాలు తెగే ఉత్కంఠ.

ఎన్‌సిబి విచారణకు దీపికా పదుకోన్ ఇప్పటికే 12మంది లాయర్ల బృందంతో సిద్ధం కాగా..బాలీవుడ్ టాప్ స్టార్ హీరోల్లో కొంతమంది తమ లీగల్ టీమ్‌ని రెడీ చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. సారా ఆలీఖాన్..శ్రద్ధాకపూర్ సెప్టెంబర్ 26 అంటే శనివారం ఎన్‌సిబి ఎదుట హాజరు కావాల్సి ఉఁది.

ఇప్పటికే డిజైనర్ సైమన్ ఖంబోట్ నార్కోటిక్స్ విచారణ ఎదుర్కొంటోంది.మొదటి రోజుల్లో సైమన్, రకుల్ ప్రీత్ సింగ్ సారా ఆలీ ఖాన్ పేర్లే బైటికి వచ్చాయ్. శుక్రవారం అసలు ఈ ముగ్గురిని కలిపి విచారించే అవకాశాలు కూడా లేకపోలేదు.



ఇప్పటిదాకా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించినవారి జాబితా చూస్తే, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, టాలెంట్ మేనేజర్ జయాసాహా, సైమన్ ఖంబోట్, కరిష్మా ప్రకాశ్ ఉన్నారు. విచారణకు వస్తున్నవారిలో దీపికా పదుకోన్..సారా ఆలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు.

స్టార్ హీరోయిన్లతో సహా ఏడుగురికి ఎన్‌సీబీ నోటీసులు.. రకుల్‌పై ప్రశ్నల వర్షం నేడే!


ఈ లిస్ట్ ఇక్కడితో ఆగదంటున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మొత్తం 150మందికి పైగా పేర్లను తమ విచారణ జాబితాలో పెట్టుకున్నారు. వారందరికీ నోటీసులు పంపడం, తర్వాత ఎంక్వైరికి పిలవబోతోంది. వీరిలో అవసరాన్ని బట్టి కొంతమందిని అరెస్ట్ కూడా చేయబోతోంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో



నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దగ్గరున్న 150మంది లిస్ట్‌లో ఎవరెవరి పేర్లున్నాయ్? ఎవరా హీరోలు?ఎవరు హీరోయిన్లు? టాలెంట్ మేనేజర్లెంతమంది ఉన్నారు?ఈ విషయాలే బాలీవుడ్‌లో మాత్రమే కాదు..టాలీవుడ్‌లో కూడా పిచ్చ టెన్షన్ కలిగిస్తోంది. ఓ సారంటూ నార్కోటిక్స్ బ్యూరో నుంచి పిలుపు వస్తే ఇక దాచడానికేం ఉండదు.



రొటీన్ ఇంటరాగేషన్ కాకుండా, పూర్తి మైండ్‌గేమ్‌తో, పక్కా ఆధారాలు చూపించి ప్రశ్నలు అడుగుతుంటే తప్పించుకోవడం కష్టమంటున్నారు.

Related Posts