Home » మోడీకి సపోర్ట్ చేసినప్పుడు దేశభక్తురాలు…JNUకి వెళ్లాక దేశద్రోహి
Published
1 year agoon
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే జేఎన్ యూ విజిట్ పై బీజేపీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దీపాకా నటించిన చపాక్ సినిమాను బహిష్కరించాలంటూ బీజేపీ నాయకులు తమ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోడీ తరపున ప్రచారం చేసినప్పుడు దేశభక్తురాలైన దీపికా జేఎన్ యూకి వచ్చినప్పుడు దేశద్రోహిగా మారిందని మాజీ జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ అన్నారు. గవర్నమెంట్ క్యాంపెయిన్ కి దీపికాను అంబాసిడర్ చేసిన విషయాన్ని సందర్భంగా కన్హయ్య గుర్తుచేశాడు. దీపావళి పండుగ ముందు భారతీయ మహిళల విజయాలను హైలెట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ కీ లక్ష్మీ స్కీమ్ కి దీపికా పదుకొనే ఒక అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే.
జేఎన్ యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన దీపికా సినిమాలు చూడటం మానేయాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తున్నారు. జేఎన్ యూ లో దీపికా ఏం మాట్లాడలేదు. ఎలాంటి నినాదాలు చేయలేదు. ఎవరి పేరు ప్రస్తావించలేదు. తను చాలా సైలెంట్ గా ఉంది. గూండాల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించి వెళ్లిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. ఏ ఐడియాలజీ గురించి కానీ,పార్టీ గురించి కానీ,నినాదాలు చేయని దీపికా సినిమాలు ఎందుకు చూడకూడదు? అప్పుడు జేఎన్ యూ దాడి ఘటనకు పాల్పడింది ప్రభుత్వ మద్దుతుదారులేనని వాళ్లు అంగీకరిస్తున్నారా అని కన్హయ్య అన్నారు.
సెంట్రల్ ఢిల్లీలోని మండీ హౌస్ దగ్గర నిరసనలో పాల్గొన్న కన్హయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. దీపికాను టార్గెట్ చేస్తూ జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ జగదీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కూడా కన్హయ్య ఫైర్ అయ్యారు. ఆందోళనకు దిగిన విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న ప్రముఖలందరినీ తాను ఒకటే అడగదలచుకున్నానని, రీసెర్చ్ చేసేందుకు, టీచింగ్ కోసం వచ్చిన వేలాది మంది విద్యార్థుల,టీచర్ల హక్కులను వారి నుంచి దూరం చేయవద్దని, వారికి ఎందుకు బాసటగా నిలబడటం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నాను అంటూ బుధవారం రాత్రి జగదీష్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కన్హయ్య స్పందిస్తూ విద్యార్థులను,టీచర్లను కలవాల్సిన బాధ్యత వైస్ ఛాన్సలర్ ది అని,దీపికా పదుకొనే జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ కాదన్నారు.