లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

యూపీలో పరువు హత్య : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను గొడ్డలితో నరికి చంపిన తల్లిదండ్రులు

Published

on

Parents killed daughter : ఉత్తరప్రదేశ్‌లో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెను తల్లిదండ్రులు గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రతాప్‌గఢ్‌లోని రైల్వే ట్రాక్‌పై పడేశారు. పోలీసులు కథనం ప్రకారం.. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న యువతి అక్టోబర్ 25న అల్బాపూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై చనిపోయి కనిపించింది.ఆమె గుర్తింపును నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, కిషుందస్‌పూర్ గ్రామ నివాసి కమలేష్ కుమార్ యాదవ్ తన కుమార్తె అని పేర్కొన్నారు. అనంతరం హత్యారోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తదుపరి విచారణలో కమలేష్, అతని భార్య అనితా దేవిలు నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని శుక్రవారం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో దంపతులు తమ 20 ఏండ్ల కుమార్తె ఆరు నెలల గర్భవతి అని తెలుసుకున్న తరువాత గొడ్డలితో నరికి చంపినట్లు అంగీకరించారు.తనకు గర్భం చేసిన వ్యక్తి పేరును వెల్లడించడానికి ఆ యువతి ఇష్టపడలేదని తల్లిదండ్రులు చెప్పారు. కుమార్తె అరోగ్య సమస్యతో బాధపడగా.. వైద్యుడి సలహా మేరకు అక్టోబర్ 24న రాయ్‌బరేలిలోని ఉంచహార్‌లో అల్ట్రాసౌండ్‌ చేయించగా ఆ యువతి గర్భవతిగా తేలింది.

గర్భం దాల్చిన కుమార్తెతో ఇంటికి వెళ్తే పరువు పొతుందన్న భయంతో గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించగా.. ఆ యువతి ఒప్పుకోలేదు. వారు నేరుగా అలపూర్ వెళ్లి అక్కడికి సమీపంలో రాత్రి రైల్వే ట్రాక్‌కు తీసుకెళ్లి హత్య చేశారు. మృతదేహాన్ని ట్రాక్స్‌పై విసిరేసి వెళ్లిపోయారని నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అఖిలేష్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *