లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

‘లవ్ బ్రేకప్’ టీ షాప్..భగ్నప్రేమికుడి చాయ్..ప్రేమ గురించి సూక్తులు..

Published

on

Dehradun yong Man Opens love Breakup Tea shop : ‘ప్రేమ’ అనిర్వచనీయమైన అనుభూతి. ప్రేమ గురించి ప్రేమికులు ఎన్నో చెబుతారు. ఎవరి అనుభవాలు వారివి. కానీ ప్రేమ భగ్నమై..మనస్సు ముక్కలై..జీవితం వెతలై కన్నీటి సుడిగుండంలో చిక్కుకుపోయేవారు ఎందరో. ఆ వేదనలు, ఆవేదనలను దాటి తిరిగి తమ జీవితాలను నిర్మించుకునేది మాత్రం కొందరే.అటువంటివాటే ఓ చాయ్ వాలా. చిన్ననాటి చెలిమిగా మొదలై..ప్రేమగా మారిన క్షణం నుంచి ప్రేయసిని ప్రాణంగా ప్రేమించాడు. ఆమెకోసమే జీవితం అనుకున్నాడు. ఆమెతో జీవితాంతం హాయిగా బతకాలనుకున్నాడు. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? ఆ ప్రేయసి దూరమైంది. అతని గుండె బద్దలైంది. పిచ్చివాడైపోయాడు. జీవితమే వద్దనుకున్నాడు.

కానీ మరోసారి..అనుకన్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? అలా మొదలైందే ‘‘లవ్ బ్రేకప్’ టీ షాప్..! ప్రేమ దూరమై మనస్సు ముక్కలైనా కూడగట్టుకున్నాడు. ప్రేమ విఫలమైందని జీవితాన్ని నాశనం చేసుకోకుడదనుకున్నాడు. నా కోసం నేను అనుకున్నాడు. అలా ‘లవ్ బ్రేకప్’ టీ షాప్..పెట్టి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డెహ్రాడూన్ కు చెందిన 21ఏళ్ల యువకుడు దివ్యాన్షు బాత్రా.

ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు పాల్పడేవారు ఎంతోమంది. కానీ ఆ గాయం నుంచి తేరుకుని నలుగురి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు దివ్యాన్షు. ‘లడకీ పోతే పోయింది.. లవ్ పోతే పోయింది’ అనుకుని కెరీర్ మీద దృష్టి పెట్టాడు. ‘‘లవ్ బ్రేకప్’ టీ షాప్..!అనే పేరుతో ద్వారా ‘ఈ ప్రేమ..దోమ కన్నా.. చాయే మస్తు మజా’ అంటున్నాడు. ‘దిల్ టూటా ఆషిఖ్ చాయ్ వాలా (గుండె ముక్కలైనోడి చాయ్ కొట్టు)’.

స్కూల్లో చదువుకునే రోజుల నుంచి ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు దివ్యాన్షు. స్నేహంగా మొదలై ప్రేమగా మారినప్పటినుంచి ఆ అమ్మాయితోనే జీవితం అనుకున్నాడు. పెరిగి పెద్దవారయ్యారు. ఎన్నో బాసలు చేసుకున్నారు. ఆమెకలిసి జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాడు. వారి పెళ్లికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి ఒప్పుకోకపోవటం కల్లలయ్యాయి. అతని గుండె పగిలిపోయింది. తిండి లేదు. నిద్ర లేదు. జీవితం అంథకారంగా మారిపోయింది. ఆరు నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.

అలా డిప్రెషన్ నుంచి కోలుకున్నాడు. ప్రేమికురాలు లేకపోతే బతకలేమా? అనుకున్నాడు. అలా కోలుకుని తన తమ్ముడు రాహుల్ బాత్రాతో కలిసి ఓ చాయ్ కొట్టు కమ్ కేఫెను పెట్టాలనుకున్నాడు. దాచుకున్న డబ్బుతో గత డిసెంబర్ 16న షాప్ ఓపెన్ చేశాడు. ఆ షాపుకి ‘దిల్ టూటా ఆషిఖ్ చాయ్ వాలా (గుండె ముక్కలైనోడి చాయ్ కొట్టు) అని డిఫరెంట్ పేరు పెట్టాడు. చాయ్ తో పాటు నోరూరించే మోమోస్, ఫ్రైస్ వంటి ఫుడు కూడా పెట్టాడు.

చాయ్ కొట్టులో ప్రేమ గురించి ఎన్నో కొటేషన్లు రాసిపెట్టాడు. ‘ప్రేమ కన్నా.. చాయ్ మిన్న’ అనే మాట కస్టమర్లకు స్వాగతం పలుకుతుందక్కడ. ‘ప్రేమ వినాశనం.. చాయ్ ఔషధం’ వంటి నినాదాలెన్నో ఆ చాయ్ కొట్టులో కనిపిస్తాయి. ఆలోచింపజేస్తాయి.

తన లవ్ బ్రేకప్ గురించి దివ్యాన్షు మాట్లాడుతూ..‘‘స్కూల్ లో కలిసి చదువుకునే రోజుల దగ్గర్నుంచి మేమిద్దరం ప్రేమించుకున్నాం. కానీ ఆ అమ్మాయి అమ్మానాన్నలు మా ప్రేమను ఒప్పుకోలేదు. పెళ్లి చేయమని చెప్పేశారు. అమ్మానాన్నలకు ఇష్టంలేందే చేసుకోనని ఆమె చెప్పింది. దీంతో గత ఏడాది మా ప్రేమ ముక్కలైంది. ఆరు నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. పబ్ జీ ఆడుతూ పిచ్చి పిచ్చిగా బతికా..ఓ రోజు బాగా ఆలోచించా..అయిపోయిందేదో అయిపోయింది..ఇదేనా జీవితం అని ప్రశ్నించుకున్నా..అలా ఈ టీ షాపు పెట్టానని చెప్పుకొచ్చాడు భగ్నప్రేమనుంచి కోలుకుని కొత్త జీవితాలన్ని మొదలు పెట్టిన దివ్యాన్షు.

ఇప్పుడు ఆ ఏరియాలోనే కాదు..చుట్టుపక్కల ప్రాంతాల్లో డిఫరెంట్ నేమ్ తో పెట్టిన దివ్యాన్షు టీ షాపు చాలా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ దిల్ టూటా ఆషిఖ్ చాయ్ వాలా పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది.

మనసిచ్చిన ప్రేయసి దూరమైందని చాలా మంది దేవదాసులైపోతుంటారు. విరహగీతాలు పాడుకుంటూ పాత జ్ఞాపకాల్లో మునిగి తేలుతుంటారు. కొందరు ప్రేయసిపై కసి పెంచుకుని అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటివారికి దివ్యాన్షు స్పూర్తిగా నిలుస్తున్నాడు.