లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం..ఇంటి టెర్రాస్ పై బిడ్డకు జన్మనిచ్చి రోడ్డుపక్క వదిలేసింది

Published

on

delhi 16 years girl raped gives birth on terrace : బాధ్యతలు బాధలు అంటే ఏంటో తెలియని 16 ఏళ్ల వయస్సు. లోకమంతా ప్రేమే నిండి ఉంటుందనే అమాయకపు ఆడపిల్ల ఓ కామాంధుడికి బలైపోయింది. తాత వయస్సు ఉండే వాడు కామాంధుడిగా మారతాడని..తన జీవితాన్ని కాలరాస్తాడని ఊహించలేక మృగాడి ఉచ్చులో చిక్కుకుని ఛిధ్రమైపోయింది. అమ్మ కొంగుచాటున గారాలు పోయే 16 ఏళ్ల వయస్సులో ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయ్యింది.ఆ బిడ్డను ఏంచేయాలో తెలీయని పసివయస్సులో చేతిలోని పసిగుడ్డును దిక్కులేనిదాన్ని చేసి వదిలించుకోవాల్సిన దారుణ దుర్భర స్థితికి పాపం ఆ 16ఏళ్ల అమ్మాయికి వచ్చేలా చేసింది ఈ కామాంధులు సమాజం. దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక తన ఇంటి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను ఓ షాపు దగ్గర వదిలేసి వెళ్లిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం… అక్టోబర్ 31న పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఒంటి తడికూడా ఆరని అప్పుడే పుట్టిన బిడ్డను ఎవరో వదిలేసిపోయారని ఫోన్ లో ఎవరో చెప్పారు. వెంటనే వారు చెప్పిన అడ్రస్ కు వెళ్లిన పోలీసులకు ఆ పసిగుడ్డు కనిపించింది. ఆ చిన్నారిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆ బిడ్డను ఎవరు వదిలేసిపోయారనే దానిపై ఆ ప్రాంతంలో ఉండే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా..ఓ బాలిక బిడ్డను వదిలేసి వెళ్లిన దృశ్యాలు కనిపించటంతో ఆశ్చర్యపోయారు. ఫుటేజీ ఆధారంగా సదరు బాలికను పోలీసులు కనిపెట్టారు.ఆమెను ప్రశ్నించగా..ఆ బాలిక చెప్పిన వివరాలు..‘‘తొమ్మిది నెలల క్రితం 60 ఏళ్ల తాత తనపై అత్యాచారం చేశాడు. కానీ భయంతో ఆ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పలేదు. ఓ రోజున తనకు కడుపులో నొప్పి రావటంతో తన ఇంటి టెర్రెస్ పైకి వెళ్లగా తనకు బిడ్డ పుట్టిందని ఆ బిడ్డను ఏం చేయాలో తెలియక బాగా భయం వేసింది.. ఈ విషయం తెలిస్తే మా అమ్మ నన్ను చంపేస్తుంది అందుకే భయం వేసి ఆ బిడ్డను బట్టలో చుట్టి మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద వదిలి వెళ్లాను‘‘అని ఏడుస్తూ చెప్పింది.బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరో తెలుసుకున్నారు పోలీసులు. వెంటనే కేసు నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేప్ చేసిన వ్యక్తి బాలిక ఇంటి వద్దే ఓ కిరాణా షాపును నడుపుతున్నాడని గుర్తించారు. కాగా బాలిక తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంటుందని పోలీసులు తెలిపారు.