లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

తండ్రికి విడాకులు ఇవ్వట్లేదని తల్లిని చంపిన కొడుకు

Published

on

Delhi 17 year old son murders mother : తల్లిదండ్రుల మధ్య వచ్చిన గొడవలు ఓకొడుకుని హంతకుడ్ని చేశాయి. కన్నతల్లినే కొడుకు హత్య చేసేలా చేశాయి. తల్లిదండ్రులు అస్తమాను తన కళ్లముందే గొడవలు పడుతు చూసిన ఆ కొడుకు ఇలాప్రతీ రోజు గొడవలు పడేకంటే విడాకులు తీసేసుకోవచ్చుగా అనేవాడు. ఈ క్రమంలో తండ్రికి విడాకులిచ్చేయమని కొడుకు తల్లిమీద ఒత్తిడి తెచ్చాడు. కానీ తల్లి విడాకులకు ఒప్పుకోకపోవటంతో తల్లిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు ఘటన దేశరాజధాని ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల టీనేజర్ తండ్రికి విడాకులు ఇవ్వటంలేదని తల్లిని హత్య చేశాడు. మూడు సంవత్సరాలుగా తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. విభేదాలు వచ్చిన విడివిడిగా ఉంటున్న తండ్రి దగ్గర పెద్ద కొడుకు, తల్లి దగ్గర చిన్న కొడుకు, కూతురు ఉంటున్నారు. అలా ఒకే కుటుంబం రెండుగా విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. ఈక్రమంలో తనకు విడాకులు ఇచ్చేయాలని భర్త..భార్యను వేధిస్తున్నాడు. భార్యకు విడాకుల నోటీసులు పంపుతూనే ఉన్నాడు. కానీ దానికి ఆమె అంగీకరించడం లేదు.తల్లిదండ్రుల వ్యవహారం చూసి చిన్న కొడుకుకు విసుగొచ్చేసింది. అతను అన్నిసార్లు విడాకులు నోటిసులు పంపుతుంటే..ఇంకా ఎందుకు అతనికి భార్యగా ఉండటం..నీకు సిగ్గేయటంలేదా? విడాకులు ఇచ్చి పారేయ్..అంటూ తల్లికి చెప్పేవాడు. కానీ తల్లి విడాకులు ఇచ్చేందుకు అంగీకరించటంలేదు. అలా తండ్రి ఎన్నిసార్లు పంపించినా ఎందుకు తిరస్కరిస్తున్నావని ఆమెతో తరుచూ గొడవకు దిగేవాడు.ఇదే విషయమై కాలేజీలో అతడి స్నేహితులు.. ఆ కుర్రాడిని గేలి చేసేవారు. మీ అమ్మానాన్నలు కలిసి మిమ్మల్ని కని..ఇప్పుడు విడివిడిగా ఉంటూ పిల్లల్ని పంచేసుకున్నారని గేలిచేసేవారు. దీంతో విసిగెత్తిపోయిన ఆ యువకుడు.. నవంబర్ 30 న బైటకెళ్లినవాడు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు.కొడుకు కోసం ఎదురు చూస్తున్న తల్లి వెంటనే కొడుక్కి అన్నం పెట్టింది.తరువా కొడుకు షర్టుపై వేసుకున్న జాకెట్ లో ఏదో ఎత్తుగా కనిపించటంతో అదేంటని అడిగింది. ఏం లేదని చెప్పాడు. కానీ అతడి జాకెట్ నిచూడగా దాంట్లో కత్తి ఉండటాన్ని చూసి.. ఇదెక్కడిదని ఆ తల్లి అడిగింది. అది నా ఫ్రెండ్ ది అని బుకాయించాడు. ‘‘కత్తులతో నీకేం పనిరా..జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. సరేనని అన్నాడు కొడుకు.ఆ తరువాత తాను ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్లాలని..నువ్వు కూడా నాకు తోడుగా రావాలని తల్లిని అడిగాడు. దానికి ఆ తల్లి కొడుకు తనపై చాలా అభిమానం చూపిస్తున్నాడని మురిసిపోయింది.‘‘పిచ్చి వెధవ..వీడికి నేనంటే ఎంత ఇష్టమో..అందుకే తండ్రి దగ్గరకు కూడా వెళ్లకుండా నాతోనే ఉంటున్నాడు’’అని లోలోపల తెగ ఆనందపడిపోంది.అలా కొడుకుతో పాటు రాత్రి 12.30 సమయంలో వెళ్లింది. అలా కొంతదూరం వెళ్లగానే కొడుకు చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని జాకెట్ లో ఉన్న కత్తి తీసి తల్లిపై దాడి చేశాడు. కొడుకు హఠాత్తుగా అలా చేసేసరికి ఆ పిచ్చి తల్లికి ఏమీ అర్థం కాలేదు.ఇదేంటిరా? అంది..‘‘నాన్నకు విడాకులు ఇవ్వమంటే నువ్వు నా మాట వింటున్నావా? మీ ఇద్దరి మధ్యా గొడవలకు మేం అవమానాలు పడుతున్నాం’’అంటూ తల్లిపై కత్తితో దాడిచేశాడు. ఒకేయర్ నేను నిన్ను కన్నతల్లినిరా..అంటూ వేడుకుంటున్నా వినకుండా.. తల్లిని హత్య చేశాడు.ఈక్రమంలో అన్నతో కలిసి బయటకు వెళ్లిన తల్లి ఎంతసేపటికీ రాకపోయేసరికి ఇంట్లో ఉన్న కూతురికి భయం వేసింది. వెంటనే అన్నకు ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడిన ఆ కూతురు ఇరుగు పొరుగు వాళ్ల దగ్గరకెళ్లి ‘‘మా అన్నయ్యా..అమ్మా ఇద్దరూ కలిసి బైటకెళ్ళి చాలా సేపైంది ఇంకా రాలేదని..నాకేదో భయంగా ఉందని’’’ ఆందోళనలతో చెప్పింది. దీంతో భయపడవద్దని ఆమెకు ధైర్యం చెప్పి వాళ్లను వెతకటానికి వెళ్లగా..ఒక చెట్టు కింద రక్తపు మడుగులో ఆ తల్లి పడిపోయి ఉంది.దీంతో గాబరాపడిపోయిన స్థానికులు విషయాన్ని కూతురుకు చెప్పారు. దీంతో ఏం జరిగిందో తెలియని అయోమయంలో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..చిన్నకొడుకుని అదుపులోకి తీసుకుని విచారించగా.. తల్లిని తానే హత్య చేశానని.. తండ్రికి విడాకులివ్వకపోవడంతోనే చంపానని చెప్పాడు. అతడు మైనర్ కావటంతో పోలీసులు అతడిని జువైనల్ జైల్ కు తరలించారు.