ఢిల్లీలో మరో దారుణం : బాలికపై సామూహిక అత్యాచారం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ రాజధాని ఢిల్లీ మహానగరం మరోసారి సిగ్గుతో తలవంచుకుంది. ఆడబిడ్డ మానప్రాణాలు రక్షించలేని దుస్థితిలో సిగ్గుతో చితికిపోయింది. పదే పదే ఢిల్లీలో జరిగుతున్న దారుణాలకు అడ్డుకట్టమాత్రం పడటంలేదు. మరో ఆడకూతురు కామాంధుల దాష్టీకానికి ఢిల్లీనగరం వేదికైంది.


ఢిల్లీలోని హర్ష విహార్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పశువుల్లా ఆమె జీవితాన్ని చిదివేశారు. మంగళవారం (సెప్టెంబర్ 15,2020) ఐసోలేషన్ బిల్డింగ్ వద్ద నైఫ్ పాయింట్ వద్ద ఈ దారుణం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి 10 గంటల సమయంలో తన బావతోతిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు.


కత్తులతో బెదిరించి పాతబడిన భవనంలోకి ఇద్దరినీ లాక్కెళ్లారు. ఆ బాలికపై అత్యాచారానికి యత్నిస్తుండగా ఆమె బావ అడ్డుకున్నాడు. దీంతో ఆ ముగ్గురు అతన్ని దారుణంగా కొట్టి పడేసి బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న పర్సులు..ఫోన్లు లాక్కుని బైక్ పై పరారయ్యారు.


ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దీంట్లో భాగంగా.. ఘటన జరిగిన ప్రాంతాల్లో సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలించారు. బాధితులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారంగా.. మాండోలి జైలు సమీపంలో బుధవారం నిందితులను గుర్తించారు వారిని పట్టుకునే సమయంలో పోలీసులను గమనించిన సదరు ముగ్గురు పారిపోతుండగా మూడు కిలోమీటర్లు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని షెజాద్, రాజీవ్,ఇక్రమ్ గుర్తించారు. బాలికపై దాడి చేసిన వారు ముగ్గురు బైక్ ను కూడా దొంగిలించారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Related Posts