లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

నాలుగు గోడల మధ్య దూషిస్తే SC, ST చట్టం కింద శిక్షించలేం : సుప్రీంకోర్టు

Published

on

Delhi supreem court..sc st within walls is not offence : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని నాలుగు గోడల మధ్యా దూషించారనే ఆరోపణలకు సాక్ష్యాలు లేకుంటే కనుక దాన్ని నేరంగా పరిగణించలేమని..ఆ కేసులో దూషించారనే ఆరోపణలు ఎదుర్కొనేవారికి శిక్ష విధించలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.ఓ మహిళ తనను కులం పేరుతో వేధించారని SC, ST కింద పెట్టిన కేసుపై విచారణ ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, హేమంత్ గుప్తా, అజయ్ రస్తోగిలతో కూడిన న్యాయస్థానం గురువారం (నవంబర్ 5,2020)ఈ వ్యాఖ్యలు చేసింది.ఓ మహిళ తనను వేధించారంటూ SC, STచట్టం కింద ఓ వ్యక్తిపై కేసు పెట్టగా, అది సుప్రీంకోర్టుకు విచారణకు వచ్చింది. ఈ కేసు విషయంలో ధర్మాసనం పలుకీలక వ్యాఖ్యలు చేస్తూ..‘బాధితురాలు ఎస్సీ గానీ ఎస్టీ అయినంత మాత్రాన అన్ని రకాల వివాదాల్ని..అవమానాలను SC, ST చట్టం కింద విచారించలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.బాధితులు ప్రజల మధ్య అవమానించబడినా..దానికి సాక్ష్యం ఉంటే మాత్రం సదరు చట్టాలు వర్తిస్తాయని తీరుతాయని, అలాంటి కేసుల్లోనే ఈ SC, ST చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. సదరు మహిళ పెట్టిన ఈ కేసులో మాత్రం నిందితుడిపై ఎస్టీ చట్టం 1989, సెక్షన్ 3(1) కింద పెట్టిన కేసు చెల్లదని బెంచ్ తీర్పిచ్చింది.ఇదే నేరం భవంతి బయట ఉన్న తోట వంటి ప్రదేశాల్లో నలుగురూ చూసేలా ఉన్న చోట లేదా బయటి నుంచి కనిపిస్తూ, వినిపిస్తూ ఉన్న ప్రాంతంలో జరిగితే దాన్ని నేరంగా పరిగణించవచ్చని, కానీ.. కేసు ఎఫ్ఐఆర్ లో మహిళను నాలుగ్గోడల మధ్య తిట్టినట్టుగా ఉందని, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరని..కనీస సాక్ష్యంగా కూడా ఎవ్వరూ లేకపోవటంతో దీన్ని నేరంగా పరిగణించలేమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి కేసుల్లో సాక్ష్యం చాలా ముఖ్యమని లేదా ఈ చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశముందని తెలిపారు.కాగా సదరు కేసు పెట్టిన బాధితురాలు ఓ భూమి విషయంలో జరిగిన వివాదంలో ఆమెను ఉన్నతవర్గాలవారు కులం పేరుతో దూషించారని తెలుస్తోంది. కానీ నిందితుల తరపు న్యాయవాది తన క్లైంట్ లను సదరు మహిళ కావాలనే ఆరోపణలు చేస్తోందని ఇది అవాస్తవమనీ ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఆమె దుర్వినియోగం చేస్తోందని వాదనలు వినిపించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *