లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్లు చేయొచ్చు : కేంద్రం కీలక నిర్ణయం

Published

on

Delhi : Ayurveda doctors can now perform surgeries : ఆయుర్వేద వైద్యానికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో దీర్ఘకాలిక జబ్బుల్ని కూడ నయం చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వైద్యాలను అందజేశారు. అందజేస్తున్నారు కూడా. కానీ ఆయుర్వేదం డాక్టర్లు ఆపరేషన్లు చేయటం అధికారికంగా చేసిన దాఖలాలు లేవు.కానీ రోజు రోజు ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతున్న క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయు ఆయుర్వేద వైద్య విధానం ప్రోత్సాహానికి ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద డాక్టర్లు కూడా ఆపరేషన్లు చేయవచ్చని తెలిపింది.ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు వివిధ రకాల సాధారణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలు కల్పించనుంది. దీనికి సంబంధించి ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయుర్వేద విద్య) 2016 నిబంధనలను సవరించింది. షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (ఈఎన్‌టీ, హెడ్‌, డెంటల్‌ స్పెషలైజేషన్‌) కోర్సులను పీజీలో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వారికి ప్రత్యేక శిక్షణను ప్రవేశపెట్టింది. శిక్షణ అనంతరం ఈఎన్‌టీ, దంత వైద్యంతోపాటు, కంటి శస్త్ర చికిత్సలు చేయడానికి కూడా పర్మిషన్ లభిస్తుంది.ప్రభుత్వనిర్ణయం ప్రకారం ఇకపై ఆయుర్వేద వైద్యులు స్కిన్‌ గ్రాఫ్టింగ్‌, కంటిశుక్లం శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ వంటి సాధారణ ఆపరేష్లన్లను చట్టబద్ధంగా నిర్వహించవచ్చు. నవంబర్ 19న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు పాఠ్యాంశాల్లో భాగంగా షాలియా (సాధారణ శస్త్రచికిత్స) షాలక్య (చెవి, ముక్కు, గొంతు వ్యాధులు) విధానాలలో అధికారికంగా శిక్షణనిస్తుంది. తద్వారా వారు స్వతంత్రగా సర్జరీలను నిర్వహించే సామర్ధ్యాన్ని సొంతం చేసుకుంటారు.కాగా.. ఈ ఆపరేషన్లు ఆయుర్వేద ఇన్‌‌స్టిట్యూట్‌‌లతోపాటు ఆస్పత్రుల్లో మాత్రమే చేసుకోవచ్చునని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ప్రెసిడెంట్ జయంత్ డియోపుజారి పేర్కొన్నారు. ‘సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ విభాగాలు ఆయుర్వేదంలో గత 25 ఏళ్లుగా భాగంగా ఉన్నాయి. సర్జికల్ ఓపీడీలు కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న దాంట్లో చట్టబద్ధత ఉందా అనే దానిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఆయుష్ మంత్రిత్వ శాఖతోపాటు నీతి అయోగ్‌‌తో చర్చించిన తర్వాత దీనికి చట్టబద్ధత కల్పించామని జయంత్ తెలిపారు.ఎంఎస్ (ఆయుర్వేద) శాల్య తంత్రం
డీబ్రిడ్‌ మెంట్‌ / ఫాసియోటోమీ / క్యూరెట్టేజ్
పెరియానల్ చీము, రొమ్ము గడ్డ, ఆక్సిలరీ చీము, సెల్యులైటిస్
అన్ని రకాల స్కిన్‌ గ్రాఫ్టింగ్‌, ఇయర్‌ లోబ్ రిపైర్‌
లింఫోపోమా, ఫైబ్రోమా, స్క్వాన్నోమా మొదలైన కణతుల తొలగింపు
గ్యాంగ్రేన్ ఎక్సిషన్ / విచ్ఛేదనం
తీవ్ర గాయాలనిర్వహణ, అన్ని రకాల సూటరింగ్, హేమోస్టాటిక్ లిగెచర్స్, బిగుసుకుపోయిన కండరాల చికిత్స
లాపరోటమీ
హేమోరాయిడెక్టమీ, రబ్బర్ బ్యాండ్ లిగేషన్, స్క్లెరోథెరపీ, ఐఆర్‌పీ, రేడియో ఫ్రీక్వెన్సీ / లేజర్ అబ్లేషన్ మొదలైన వివిధ పద్ధతులు.
యానల్ డైలేటేషన్, స్పింక్టెరోటోమీ అనోప్లాస్టీ
ఫిస్టులెక్టమీ, ఫిస్టులోటోమీ, పైలోనిడల్ సైనస్ ఎక్సిషన్, వివిధ రెక్టోపెక్సీలు
యురేత్రల్ డైలేటేషన్, మీటోమి, సున్తీ
పుట్టుకతో వచ్చే హెర్నియోటమీ, హెర్నియోరాఫీ, హెర్నియోప్లాస్టీ
హైడ్రోసెల్ ఎవర్షన్, థొరాసిక్ గాయానికి ఇంటర్‌కోస్టల్ డ్రెయిన్ మొదలైనవి ఉన్నాయి.

కన్నుకు సంబంధించిన ఆపరేషన్లు
కనుపాపలను సరిచేసే సర్జరీ, క్యూరెట్టేజ్ ట్యూమర్‌ తొలగింపు సర్జరీ
పాటరీజియం ఐరిస్ ప్రోలాప్స్-ఎక్సిషన్ సర్జరీ
గ్లాకోమా-ట్రాబెక్యూలెక్టమీ

కంటికి గాయం:  కనుబొమ్మ, మూత, కండ్లకలక, స్క్లెరా కార్నియా గాయాలకుమరమ్మత్తు శస్త్రచికిత్స
స్క్వింట్ సర్జరీ – ఎసోట్రోపియా, ఎక్సోట్రోపియా
డాక్రియోసిస్టిటిస్- డిసిటి / డాక్రియోసిస్టోరినోస్టోమీ [డిసిఆర్]
కంటిశుక్లం శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సతో కంటిశుక్లం వెలికితీత మొదలైనవి..

ముక్కు: సెప్టోప్లాస్టీ, పాలీపెక్టమీ, రినోప్లాస్టీ


చెవి : లోబులోప్లాస్టీ. అక్యూట్ సపరేటివ్ ఓటిటిస్, మాస్టోయిడెక్టమీ
గొంతు వ్యాధులు : టాన్సిలెక్టమీతో పాటు ఇతర చికిత్సలు
దంత ఆపరేషన్లు : వదులు దంతాల బిగింపు, రూట్ కెనాల్‌,ఇతర చికిత్స

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *