Home » Andhrapradesh » చిత్తూరులో బాలికను హత్య చేసిన ఢిల్లీ బాబు ఆత్మహత్య
Published
1 month agoon
Delhi Babu commits suicide : చిత్తూరులో మైనర్ బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఢిల్లీ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. పెనుమూరు మండలం తూర్పుపల్లి అడవిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి అడవిలోకి పారిపోయాడు. అప్పటి నుంచి పోలీసులు ఢిల్లీ బాబు కోసం గాలిస్తున్నారు. తూర్పుపల్లి అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
పూతలపట్టు మండలం చింతమాకుల పల్లికి చెందిన ఢిల్లీ బాబు.. తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే విషయం పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మైనర్లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. మేజర్ అయ్యాక పెళ్లి సంగతి చూద్దామంటూ ఎవరి ఇళ్లకు వారిని పంపించారు.
పెద్దల మందలింపుతో గత కొంత కాలంగా ఢిల్లీబాబును దూరం పెట్టింది. అతనితో మాట్లాడటం తగ్గించింది. కలవడం మానేసింది. దీంతో గాయత్రిపై ఢిల్లీ బాబు పగ పెంచుకున్నాడు. తనను దూరం పెట్టి.. వేరే ఎవరితోనో చనువుగా ఉంటుందనే అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెనుభూతమైంది. దీంతో తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదనే నిర్ణయానికి వచ్చాడు. తనతోనే మాట్లాడాలి.. తననే చూడాలి.. తననే ప్రేమించాలంటూ వేధించాడు.
గాయత్రిని చంపాలని నిర్ణయించుకున్న ఢిల్లీబాబు.. మార్కెట్లో కత్తులను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత నిత్యం గాయత్రి వచ్చిపోయే దారిలో మాటు వేశాడు. గాయత్రి రాగానే రెండు కత్తులతో కనికరం లేకుండా పొడిచాడు. కత్తిపోట్లు శరీరంపై లోతైన గాయలు చేయడంతో.. తీవ్రంగా గాయపడింది గాయత్రి. వెంటనే చిత్తూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ పేరుతో గాయత్రిని ఢిల్లీ బాబు వేధించాడని పోలీసులు చెబుతున్నారు. గాయత్రి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిన్న బాలికపై ఢిల్లీ బాబు కత్తితో దాడి చేసి అడవిలోకి పారిపోయాడు. తూర్పుపల్లి అడవిలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
వరుడి కుటుంబీకులు పెళ్లి రద్దు చేసుకోవడంతో.. అమెరికాలో ఏపీ యువతి ఆత్మహత్య
అనంతపురంలో కరోనా కలకలం
అమెరికా వెళ్తానన్న భార్య, నరికి చంపిన భర్త, ఆ తర్వాత ఆత్మహత్య.. గుండెలు పిండే విషాదం
హైదరాబాద్లో దారుణం : మూడేళ్ల బాలుడిని చంపేసిన పెద్దమ్మ..తనకు సంతానం కల్గలేదనే అక్కసుతో హత్య
పెద్దపల్లి జిల్లాలో వందల సంఖ్యలో నాటుకోళ్లు మృతి..వింతరోగమా లేదా బర్డ్ ఫ్లూ కారణమా?
మున్సిపల్ ఎన్నికల రీ నామినేషన్లకు ముగిసిన గడువు…అంతగా ఆసక్తి చూపని అభ్యర్థులు