లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

ఢిల్లీలో 6 గజాల్లో మూడంతస్తుల ఇల్లు…ఇక కనిపించదు

Published

on

Delhi :famous three storey house 6 yard demolished : దేశరాజధాని ఢిల్లీలోని బురాడీలో 6 గజాల స్థలంలో నిర్మించిన మూడు మూడంతస్తుల భవనం ఇక కనిపించదు. ఆ ముచ్చటైన ఇల్లుని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ ఇల్లు ఇక కనుమరుగుకుకానుంది.బురాడీలోరి కేవలం ఆరంటే ఆరు గజాల్లో కట్టిన ఈ ఇల్లు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఇంటిని చూడటానికి ఎంతోమంది చాలా ఆసక్తిచూపిస్తుంటారు. అంత చిన్న స్థలంలో ఏకంగా మూడు అంతస్తుల ఇంటిని ఎలా కట్టారా అని..దూర ప్రాంతాల నుంచి జనం తరలివచ్చి మరీ చూసేవారు.

వెడ్డింగ్ కార్డుపై ఇన్విటేషన్ లింక్..విందు డోర్ డెలివరీ..పెళ్లిని లైవ్ లో చూడండీ..ఆశీర్వదించండీ..
ఆరు గజాల అతిచిన్న స్థలంలో ఇంటిని ఎలా కట్టారో చూడాలని చాలామంది తపనపడిపోతుంటారు. అయితే త్వరలో ఆ ఇల్లు కనుమరుగుకానుంది. కానీ అంత చిన్న స్థలంలో అంత పొడుగు ఇంటిని నిర్మించిన ప్లానర్‌ను అభినందించాల్సిందేననే వారు ఆ ఇంటిని చూసినవారంతా.ఈ ఆరు గజాల్లో కట్టిన ఈ మూడు అంతస్తులు ఇంట్లో బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, టెర్రస్, చిన్న మెట్లు అంతా వెరైటీయే..ఇంటిలో ఫ్లోరింగ్ పాలరాతితో నిర్మించారు. ఆ ఇంటిలో భార్యా భర్తా…ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు.కాగా..భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘిస్తూ, నిర్మించిన ఈ ఇంటిని కూలగొట్టాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ ఇల్లు… చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు ప్రమాదకరంగా మారిందని అధికారులు భావించారు. ఈక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఇంటిని కూల్చివేయాలని నిర్ణయించింది.ఓఇల్లు నిర్మించాలంటే కనీసం 32 చదరపు అడుగుల స్థలం అవసరముంటుందనీ..కానీ కేవలం ఆరు గజాల్లో మాత్రమే కట్టిన ఈ ఇంటి నిబంధనలకు అతీతమని ఎంసీడీకి చెందిన ఇంజినీరు ఒకరు తెలిపారు.ఇటువంటి ఇళ్లకు ఎప్పటికీ అనుమతి లభించదన్నారు. ఈ ఇంటి గురించి చాలామంది తమకు ఫిర్యాదు చేశారని, దీనిని త్వరలోనే కూల్చివేయనున్నామని తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *