లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఒక్క రోజే ఎస్ఐపై 4లైంగిక వేధింపుల కేసులు.. రోడ్లపై ఒంటరిగా కనిపించిన మహిళలే టార్గెట్

Published

on

Delhi పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌పై ఒకే రోజు నాలుగు లైంగిక వేధింపు కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 17న ముగ్గురు మహిళలు ఢిల్లీ ద్వారక స్టేషన్లో ఓ వ్యక్తి గ్రే కలర్ Baleno కారులో వచ్చి వేధించాడని కేసు ఫైల్ చేశారు. ఉదయం 8నుంచి 9మధ్యలో జరిగిన ఈ ఘటనపై నాలుగో వ్యక్తి కూడా అదే రకమైన ఫిర్యాదు చేశారు.

నాలుగు డిఫరెంట్ కేసులు ఫైల్ చేసిన పోలీసులు.. పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిలో బాధితురాలైన ఒక మహిళ ఆమెకు జరిగిన వేధింపులను ఇలా వివరించింది.‘అక్టోబర్ 17న సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా.. గ్రే రంగులో ఉన్న కారు, అద్ధం పగిలి ఉన్న కారు కనిపించింది. కాసేపటి తర్వాత కారు నా పక్కనే వెళ్తున్నట్లు గమనించాను. అందులో ఉన్న వ్యక్తి హారన్ కూడా కొట్టాడు. అతని వైపుకు చూడలేదు. మళ్లీ హారన్ కొట్టాడు. పట్టించుకోకపోతే వెళ్లిపోతాడనుకున్నా. అతను వెళ్లలేదు’

ద్వారకాలోని సెక్టార్ 14కు వెళ్లడానికి దారి గురించి అడిగాడు. అడ్రస్ చెప్పే లోపే ప్యాంట్ జిప్ తీసి అతని ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేసుకుంటూ అసభ్యంగా కనిపించాడు. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపొమ్మని అరిచా. చుట్టూ ఎవరూ లేకపోగా అక్కడి నుంచి కార్లు చాలా వేగంగా వెళ్తూ కనిపించాయి. కార్లో ఉండే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.

దగ్గర్లో కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్న వైపుకు తిరిగి గట్టిగా అరవడం మొదలుపెట్టడంతో.. ఆ వ్యక్తి పారిపోయాడు. అతణ్ని ట్రేస్ చేయడానికి 200మంది పోలీసుల సహకారంతో 200సీసీటీవీ కెమెరాలు చెక్ చేశారు.

మొత్తం రిజిష్టర్ అయిన Baleno కార్లు 286ఉన్నట్లు తెలిసింది. నిందితుడు వాడిన కారుకు రిజిష్ట్రేషన్ నంబర్ కూడా లేదు. ఎట్టకేలకు ఢిల్లీలోని జానక్ పూరి కాలనీలో ఇంట్లోనే దొరికిపోయాడు నిందితుడు. అతణ్ని సబ్ ఇన్‌స్పెక్టర్ పుణీత్ గ్రేవాల్ గా గుర్తించారు అధికారులు.

ఇంకా చాలా మంది మహిళలను వేధించినప్పటికీ అతనిపేరిట ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదుకాలేదని పోలీసులు చెప్పారు. వచ్చిన కంప్లైంట్ ల ఆధారంగా అతనిపై విచారణ చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *