లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఎల్లోకలర్ స్కూటీ కొనుక్కున్న చెల్లెలు..అన్నను అరెస్ట్ చేసిన పోలీసులు: బాధ్యతలేదాంటూ..మండిపడ్డ కోర్టు

Published

on

delhi court chides police over illegal arrest : ఢిల్లీకి చెందిన ఓ యువతి ఎంతో ఇష్టపడి పసుపు రంగు కలర్‌‌ స్కూటీ కొనుక్కుంది. ఆ స్కూటర్ కు బాడీపై రెడ్ కలర్ రీములు కూడా ఉణ్నాయి. మంచి కలర్ కాంబినేషన్ తో ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఈ స్కూటీని చూసి తెగ మురిసిపోయేది. ఈక్రమంలో ఆ ఎల్లోకలర్ స్కూటీ ఆమె అన్నపాలిట శాపమైంది. పోలీసులు ఆ యువతి అన్నను అరెస్ట్ చేశారు.

ఓ అమ్మాయి పర్సు కొట్టేసీ దారిలో ఆ స్కూటీని దొంగిలించాడన్న నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ విచారించిన న్యాయమూర్తి అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ముక్క చీవాట్లు పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు విషయంలో జడ్జీ ఇచ్చిన షాకుకు పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది.

ట్విస్టుల మీద ట్విస్టులుగా సాగిన ఈ కేసు వివరాలు : ఢిల్లీలో ఇటీవల ఓ వ్యక్తి పర్సు చోరీకి గురైంది. ఈ చోరీ చేసిన వ్యక్తి తన పర్సు కొట్టేసి పసుపు రంగు స్కూటీపై పరారయ్యాడని..ఆ స్కూటీకి రెడ్ కలర్ రీములు ఉన్నాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఎల్లో కలర్ స్కూటీకి సంబంధించి వివరాలు సేకరించారు. ఈ రెడ్ కలర్ రీములున్న ఎల్లో కలర్ స్కూటీ ఓ యువతిదని గుర్తించారు. వెంటనే ఆ యువతికి ఓ నందా అనే ఓ అన్న ఉన్నాడని తెలుసుకున్నారు.

అతనే పర్సు చోరీ చేసిన వ్యక్తి నందాయేనని భావించి అరెస్ట్ చేశారు. ‘‘ఆ పర్సేమిటో ఆ చోరీ ఏమిటో నాకేం తెలీదని’’ నందా మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోకుండా అతడిని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారు. దీంతో నందా చెల్లెలు పోలీస్ స్టేషన్ కు వచ్చి తన అన్నకు బెయిల్ ఇవ్వలని కోరింది. దీంతో పోలీసులు మీ అన్నకు బెయిల్ ఇవ్వాలంటే రూ.50వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మా అన్నకు ఈ చోరీకి ఏమీ సంబంధం లేదు..మా అన్న అటువంటివాడు కాదు ఎందుకిలా మమ్మల్ని వేధిస్తున్నారని ప్రశ్నించింది. దానికి పోలీసులు ఆమెను ఇష్టమొచ్చినట్లుగా దూషించి ‘‘రేపు మీ అన్నను కోర్టులో ప్రవేశపెడతాము..జైలుశిక్ష పడితే అప్పుడు తెలుస్తుంది. రూ.50వేల కోసం మీ అన్నను జైలుకు పంపుతావా? అదే జరగాలనుకుంటే మీరేమన్నా చెప్పుకోవాలనుకుంటే అక్కడ చెప్పుకోండి’’ అంటూ తిట్టి పంపించేశారు.

ఆ మరునాడు నందాను పోలీసులు అడిషనల్ సెషన్స్‌ కోర్టులో హాజరుపరచగా తనకు జరిగిన అన్యాయంపై నందా జడ్జికి చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నాడు. బెయిల్‌ ఇవ్వాలంటే ఏఎస్ఐ రూ.50వేలు లంచం డిమాండ్ చేశారని నందా చెల్లెలు నిరూపిస్తు ఆ సమయంలో పోలీసులు అన్న మాటల్ని రికార్డును జడ్జికి సమర్పించింది. దీంతో దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి..ఓ చోరీలో దొంగను పట్టుకోకపోగా..నిర్ధోషిపై నిందలు మోసి బెయిల్ అడిగితే లంచం డిమాండ్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నందాపై తప్పుడు కేసు పెట్టిన ఎస్‌హెచ్‌వో, దర్యాప్తు అధికారితో పాటు లంచం డిమాండ్ చేసి ఏఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ డీసీపీని జడ్జి ఆదేశించారు. దానికి పోలీసులు నిందితుడు హెల్మెట్ పెట్టుకోవటంతో పోల్చుకోలేకపోయామని చెప్పుకున్నారు.అయినా జడ్జి వినలేదు.నిర్ధోషుల్ని ఇలా వేధించటం పైగా లంచం డిమాండ్ చేయటంపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. స్పష్టంచేసింది.