Full tali : రూపాయికే కడుపు నిండా భోజనం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Delhi just Rs.1 Rupee full tali : రూపాయి. భారత దేశంలో ఎన్ని లక్షలైనా కోట్లైనా రూపాయితోనే మొదలవుతుంది. అటువంటి రూపాయి పెడితే ఏం వస్తుంది? చిన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా రావటం లేదు. ఒక చిన్న చాక్లెట్ కూడా రాదు. అటువంటిది ఓ మానవతామూర్తి కేవలం ఒకే ఒక్క రూపాయికి కడపునిండా అన్నం పెడుతున్నాడో మానవతామూర్తి.




రూపాయికే భోజనం అంటే ఏదో పెట్టాంలే అనేలా కాకుండా ఆరోగ్యకరమైన ‘‘సోయా పులావ్’’ తో పాటు ఐదారు రకాల పదార్ధాలంతో కడుపునిండా తృప్తిగా తినేలా అన్ని వంటకాలూ ఉన్న పసందైన భోజనం పెడుతున్నారు 51 ఏళ్ల ప్రవీణ్ కుమార్ గోయల్.

చపాతీలు, పప్పు, సోయా పలావ్, పులుసు, పెరుగు, పచ్చడి, స్వీటు అన్నీ ఉంటాయి. కానీ ధరమాత్రం సింగిల్ రూపీనే. కేవలం ఒకే ఒక్క రూపాయిని నామమాత్రంగా తీసుకుని కడుపు నింపుతున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలో ‘‘శ్యామ్ రసోయి’’పేరుతో ఓ ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేసి కరోనా కష్టంలో ఉన్నవారికి కేవలం నామ మాత్రంగా ఒకే ఒక్క రూపాయి తీసుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకూ గత రెండు నెలలుగా కడుపునిండా చక్కటి భోజనం పెడుతున్నారు. పేదవారితో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఈ రూపాయి భోజనాన్ని అందిస్తున్నారాయన. గతంలో రూ.10లకు పెట్టే ఈ భోజనాన్ని ఇప్పుడు రూపాయి భోజనంగా మార్చారాయన.


రూపాయి భోజనం గురించి పర్వీన్ కుమార్ గోయల్ మాట్లాడుతూ..కరోనాతో చాలామంది ఉపాధి కోల్పోయారు. లాక్ డౌన్ ఎత్తివేయటంతో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు తెరుచుంటున్నాయి. చిన్న చిన్న పనులు చేసుకుని బతుకున్నారు. అటువంటి పేదవారితో పాటు ఆకలితో ఉండే ప్రతీ వారికి కడుపు నింపటం మాకు చాలా సంతోషాన్నిస్తోందని అన్నారు. కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటున్నాం. ఆ రూపాయి దేనికీ సరిపోదు..ఉచితంగా కూడా పెట్టవచ్చు..కానీ రూపాయి ఎంత విలువైందో ప్రజలు ఈ కరోనా కష్టంలో తెలుసుకున్నారు. అది పేదవారైనా సరే ధనవంతులైనా సరే. అందుకే ఆ రూపాయి తీసుకుని భోజనం పెడతున్నామని తెలిపారు.


ప్రతీ రోజు 1000 నుంచి2వేలమందికి ఈ రూపాయి భోజనం చేస్తుంటారని తెలిపారు. రూపాయే తీసుకుంటున్నాం కదాని నాణ్యత లేని భోజనం కాకుండా ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలని అనుకున్నామని అందుకే సోయా పులావ్ తో పాటు ఐదారు రకాలతో పసైందైన భోజనంపెడుతున్నామని..ఇక్కడికొచ్చి తినేవారే కాకుండా ఈ-రిక్షాల ద్వారా పార్శిల్స్ పలు ప్రాంతాలకు అందజేశాలా చేస్తున్నామని తెలిపారు. ప్రతీరోజు ఇకేలాంటి ఆహార పదార్దాలు కాకుండా మారుస్తుంటామని తెలిపారు.


మాకు కొంతమంది సహాయం చేస్తున్నారు..వారి నుంచి డబ్బుల రూపంలో కాకుండా భోజనానికి అవసరమైన సరుకులను తీసుకుంటున్నామని..మేము పెట్టే ఈ రూపాయి భోజనానికి ఓ వృద్ధ మహిళ గోధుమలను ఇచ్చారని ఇలా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.


నాకు సహాయకులుగా మరో ఆరుగురు వ్యక్తులు పనిచేస్తున్నారనీ..వారంతా అదోక పనిలా కాకుండా బాధ్యతగా పనిచేస్తున్నారన్నారు. కాలేజ్ విద్యార్ధులు కూడా ఈ సేవాకార్యక్రమంలో భాగం పంచుకుంటున్నారనీ ఇది చాలా సంతోషించాల్సిన విషయమని అన్నారు.

Related Tags :

Related Posts :