ఎర్రకోటకు సమీప పార్క్‌లో రేప్.. తలపై కొట్టి రక్తమోడుతుండగా పరారీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నార్త్ ఢిల్లీలోని ఎర్రకోటకు దగ్గరల్లో ఉన్న పార్కులో 23ఏళ్ల మహిళపై రేప్ జరిగింది. శనివారం జరిగిన ఈ ఘటనలో మహిళ పెనుగులాడుతుండగా ఆ వ్యక్తి తలపై గట్టిగా కొట్టాడు. బాధితురాలికి నిందితుడు ముందుగానే తెలుసని పోలీస్ అధికారి తెలిపారు. శనివారం రాత్రి తల నుంచి రక్తం కారుతున్న మహిళను ఓ వ్యక్తి గుర్తించారు.

పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించడంతో వారు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్లకు జరిగిన ఘటన గురించి వివరించింది బాధితురాలు. పార్క్ లో రేప్ చేయడంతో పాటు ఎదుర్కోబోతే తలపై రాయితో కొట్టినట్లు చెప్పింది. దాంతో పాటు ఆమె కూతుర్ని కూడా ఆ వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు ఇచ్చింది.

తర్వాత పోలీసులు ఆమె కూతుర్ని వెతికిపట్టుకున్నారు. ‘ఈ ఘటన శనివారం జరిగింది. సంబంధిత సెక్షన్ల ప్రకారం.. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోనికా భరద్వాజ్ తెలిపారు.Related Posts