హైదరాబాద్ లో వరదలు, ఢిల్లీ సీఎం రూ. 15 కోట్ల సాయం, కృతజ్ఞతలు చెప్పిన సీఎం కేసీఆర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Delhi govt will donate Rs 15 cr to the Govt of Telangana : రాష్ట్రంలో పోటెత్తిన వరదలపై రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం తెలంగాణ రాష్ట్రానికి రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. హైదరాబాదీలకు ఢిల్లీ ప్రజలు అండగా ఉంటారని, తమ ప్రభుత్వం తరపున రూ. 15 కోట్లను తక్షణమే ఆర్థిక సాయంగా ఇస్తున్నట్లు వెల్లడించారాయన. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. ఈ మేరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు.మరోవైపు..బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. క్యుములోనింబస్ మేఘాల వల్ల హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయ నుంచి వర్షం కురుస్తోంది. ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్నజనాలకు మరింత కష్టాలు పడుతున్నారు. వరద నీటితో కాలనీలు ఇంకా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వరద బాధితులను ఆదుకొనేందుకు చర్యలు తీసుకొంటోంది. మేఘలు దట్టంగా అలుముకోవడంతో మధ్యాహ్నమే చీకటిగా మారుతోంది.హైదరాబాద్ లో భారీ వర్షాలు, వరదలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం, నష్టపరిహారం ప్రకటించారు.
వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.10వేలు.

వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిన వారికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు.
దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు
బాధిత కుటుంబాలకు 2020, అక్టోబర్ 20వ తేదీ మంగళవారం నుంచే నష్టపరిహారం పంపిణీ.

Related Tags :

Related Posts :