లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పిలవకపోయినా వస్తారు : పెళ్లి జరగాలంటే పోలీసులు ఉండాల్సిందే

Published

on

Delhi : Gurgaon Cops To Attend Wedding : పిలవని పేరంటానికి వెళతామా ఏంటీ? అనేవారు పెద్దలు. పిలవని పేరంటానికి వెళితే అవమానాలు తప్పవని పెద్దలు చెప్పిన సామెత. కానీ ప్రస్తుతం పోలీసులు మాత్రం పిలవకపోయినా ఎక్కడ పెళ్లి జరిగితే అక్కడకు మేం వచ్చేస్తామంటున్నారు.


వధూవరులకు గానీ వారి బంధువులతో గానీ ఎటువంటి సంబంధం లేకపోయిన పెళ్లి వచ్చితీరతామంటున్నారు హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు. మరి సంబంధం లేని పెళ్లిళ్లకు పోలీసులు ఎందుకొస్తున్నారంటూ దటీజ్ కరోనా కాలపు పెళ్లిళ్ల పరిస్థితి అని చెప్పాల్సిందే.కరోనా..మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం ఈ మూడు కరోనాల కాలంలో కచ్చితమైన నిబంధనలు. ఇల్లు దాటితే ఇవి పాటించాల్సిందే. మరి పెళ్లిళ్ల విషయంలో మరింత కచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు పోలీసులు. మరి నిబంధలన ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? అంటే చాలా వరకూ లేవనే చెప్పాలి. పెళ్లిళ్లకు 50మందికి మించకుండా హాజరవ్వాలని నిబంధనలు ఉన్నా ఏమాత్రం పాటించటంలేదు. దీంతో పోలీసులు పిలవని పేరంటానికి మేం వస్తాం..అంటున్నారు.


వావ్..చీపురు బైక్ : రయ్ మని దూసుకుపోతున్న కుర్రాళ్లు

వివరాల్లోకి వెళితే..వివాహ వేడుకలకు ఆహ్వానం లేకుండానే పోలీసులు అధికారికంగా వెళ్లే పరిస్థితిని కరోనా సృష్టించింది. హర్యానాలోని గురుగ్రామ్‌ పోలీసు కమిషనర్‌ కెకె రావు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నగరంలో జరిగే వివాహ వేడుకలకు పోలీసులు హాజరవుతారు. అతిథులను తనిఖీ చేసి, మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కరోనా మహమ్మారిని అడ్డుకోవటానికి తగిన చర్యలు తీసుకుంటామంటున్నారు.భౌతిక దూరంతో పాటు పెళ్లి జరిగే సమయంలోను..ఆయా ప్రాంతాల్లోను కరోనా నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే విషయంపై డేగకళ్లతో పరికించి నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. హర్యానాలో కేసులు పెరగుతుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు హర్యానాలోని గురుగ్రామ్‌ పోలీసు కమిషనర్‌ కెకె రావు.


కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో గురుగ్రామ్‌లోని అధికారులు ఢిల్లీ నుంచి నగరంలోకి వచ్చే వ్యక్తులకు పరీక్షలు చేస్తున్నారు. సోమవారం (నవంబర్ 23,2020)ఒక్కరోజే 2,663 కొత్త కేసులు నమోదుకావడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,19,963 కు చేరుకుంది.


కరోనా బారిన పడి మరో 28మంది చనిపోగా మరణాలు సంఖ్య 2,216గా నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తాజాగా గురుగ్రామ్ జిల్లాలో 866, ఫరీదాబాద్‌లో 577 కేసులు నమోదయ్యాయ. దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య సోమవారం నాటికి 91 లక్షలను దాటింది.


ఒక్క రోజులోనే 44,059 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈక్రమంలో మరి పోలీసులు పెళ్లి వారు పిలవకపోయినా రావటంలో ఎటువంటి తప్పూ లేదు. మరి వారి డ్యూటీ వారు చేయాలి కదా ప్రజల కోసం కరోనా వారియర్ గా యుద్ధం చేసే పోలీసులకు ప్రతీ ఒక్కరూ సహకరించాల్సి అవసరం చాలా ఉంది. అలాగే ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా వ్యవహరించాలని మరచిపోకూడదు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *