లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వివాహేతర సంబంధం ఉందని భార్యపై అనుమానం – దారుణంగా చంపిన భర్త

Published

on

Delhi Man arrested for killing wife, over suspicion of illicit affair in northwest Delhi : కట్టుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆమెను కిరాతకంగా హత్య చేసాడు. జనవరి 4వ తేదీన చావ్లా తేజ్ పూర్ రోడ్డు పక్కన ఉన్న పొదల్లో ఓమహిళ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను గొంతుకోసి కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు.

ఘటనా స్ధలంలో ఆమెకు సంబంధించిన వివరాలు ఏమీ లభ్యం కాలేదు. మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని అన్ని పోలీసు స్టేషన్లను విచారించగా..వాయువ్య ఢిల్లీలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలుసుకున్నారు.  అదృశ్యమైన మహిళ వివరాలు తమకు లభ్యమైన మహిళ మృతదేహం ఆనవాళ్లు సరిపోయినట్లు పోలీసులు గుర్తించారు. మిస్సింగ్ మహిళ గురించి ఫిర్యాదు చేసిన బల్జీత్ విహార్ లోని వ్యక్తి ఇంటికి వెళ్లారు.

అక్కడ ఆమె కుమారుడు శివంను ఆస్పత్రికి తీసుకువెళ్లి తమకు దొరికిన మృతదేహాన్ని చూపించారు. ఆమె తన తల్లి సరస్వతిగా శివం చెప్పాడు. తల్లి శవం చూసి శివం భోరున విలపించాడు. అయితే భర్త సోహన్ కనిపించక పోవటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు అతడి గురించి గాలింపు చేపట్టారు. సోహన్ చౌరాసియా ను మంగళవారం నిహారీ రోడ్డులో అరెస్ట్ చేశారు. భార్యను తానే హత్య చేసినట్లు సోహన్ ఒప్పుకున్నాడు.

తమ ఇంట్లో రెండేళ్లుగా కలిసి జీవిస్తున్న చందన్ అనే వ్యక్తితో భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేసినట్లు అంగీకిరించాడు. జనవరి 3వ తేదీన… మార్కెట్ కు, వికాశ్ విహార్ నాలా వద్దకు వెళ్దామని చెప్పి భార్యను నమ్మించిన సోహన్, ఆమెను తీసుకుని కారులో బయలుదేరాడు.

కొంత దూరం ప్రయాణించి నిర్జన ప్రదేశంలోకి రాగానే ఆమె మెడను ప్లాస్టిక్ తాడు బిగించి ఊపిరాడకుండా చేశాడు.ఆమె పూర్తిగా అపస్మారక స్ధితిలోకి చేరుకున్నాక పదునైన కత్తితో మెడకోసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తేజ్ పూర్ చావ్లా రోడ్డు ప్కకనున్న పొదల్లో పడేసి పారిపోయినట్లు వివరించాడు.