ఏడోసారి ప్లాస్మా దానం చేస్తున్నాడు..శభాష్ అనాల్సిన జనాలు ముఖాలు తిప్పుకుంటున్నారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక..తనుకు తాను బతికేయక..ఇతరులను రక్షిస్తున్నాడు తబ్రేజ్ ఖాన్. ఒకసారి కాదు..రెండుసార్లు కాదు..ఏకంగా 7 సార్లు ప్లాస్మా దానం ఇచ్చి అందరికీ స్పూర్తినిస్తున్నాడు 36 ఏళ్ల యువకుడు.

ఇతని కారణంగా..12 మంది ప్రాణాలు నిలబడ్డాయి. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులు ముందుకొచ్చే విధంగా..చేస్తున్నట్లు, తాను ఒక రోల్ మోడల్ గా నిలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

జహంగీర్పురి నివాసి అయిన..ఇతను మొదటిసారిగా ప్లాస్మా దానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. మార్చి నెలలో ఇతనికి కరోనా వైరస్ సోకింది. ఏప్రిల్ 05వ తేదీన వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఏప్రిల్ 20వ తేదీన తబ్రేజ్ ఖాన్…ILBS లో తొలి ప్లాస్మా దానం చేశాడు.

కొద్ది రోజుల క్రితం ఓ కుటుంబం తన వద్దకు వచ్చిందని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్లాస్మా దానం చేస్తే..అతను రికవరీ అయ్యాడని, అతని కుటుంబం తనను భావోద్వేగంతో అభినందించిన విషయం మరిచిపోనన్నారు.
అయితే..కొన్ని నెలలుగా పరిస్థితులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు తనను చూసిన సమయలో ముఖాలను తిప్పుకుంటున్నారని, గతంలో సాయంత్రం కోసం టీకి రావాలని స్థానికులు ఆహ్వానించే వారని..కానీ ఇప్పుడు విస్మరిస్తున్నారు. ముస్లిం అయినందున..వైరస్ ను వ్యాపించాడని తనపై ఆరోపణలు చేశారని..ఇలా చేయడం బాధించిందన్నారు. ఇక్కడ తబ్లిగి జమాత్ ఘటనను గుర్తు చేశారు.

ఇలాంటి ధ్వేషం అంతం కావాలని కోరుకుంటున్నట్లు, తాను ఇచ్చిన ఆరు ప్లాస్మా దానాల్లో ఆరు హిందూ కుటుంబాలున్నాయన్నారు. వైరస్ విస్తరిస్తున్న క్రమంలో..మతం అనే మాట ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఇన్నిసార్లు ప్లాస్మా దానం చేసినా..ఢిల్లీ ప్రభుత్వం, జిల్లా డీఎం నుంచి ఎలాంటి రెస్పాండ్ లేదని తెలుస్తోంది.

Related Posts