Home » ఢిల్లీలో ఒక్క నెలలోనే 2వేల 400 కరోనా మృతులు
Published
2 months agoon
By
subhnDelhi: జాతీయ రాజధాని ఢిల్లీలో ఒక్క నెలలోనే 2వేల 364 కరోనా మృతులు సంభవించాయి. అక్టోబర్ 28నుంచి తీసుకున్న డేటా ఆధారంగా రోజుకు 5వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్లు అధికారిక సమాచారం. బుధవారం 99మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతులు 8వేల 720కు చేరాయి.
నవంబర్ 19న సిటీలో 98 మృతులు సంభవించగా, నవంబర్ 20న 1198 మృతులు , నవంబర్ 21న 111 మృతులు, నవంబర్ 22, నవంబర్ 23 తేదీల్లో 121మంది చొప్పున చనిపోయారు. నవంబర్ 24న 109 మృత్యువాత పడినట్లు రికార్డులు చెబుతున్నాయి.
అత్యధికంగా కరోనా మృతులు అంటే నవంబర్ 18 మాత్రమే రికార్డుల్లో ఉంది. నవంబర్ 11న అత్యధికంగా 8వేల 593కేసులు నమోదయ్యాయని సమాచారం. గురువారం ఢిల్లీలో కరోనా కేసులు 7వేల 546 నమోదుకాగా, శుక్రవారం 6వేల 608, శనివారం 5వేల 879, ఆదివారం 6వేల 746, సోమవారం 4వేల 454, మంగళవారం 6వేల 224, బుధవారం 5వేల 246వరకూ నమోదయ్యాయి.
బుధవారం నాటికి ఢిల్లీలో కేసులు 5లక్షల 45వేల 787 వరకూ నమోదయ్యాయి. అందులో 4లక్షల 98వేల 780మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారని డేటా చెబుతుంది. కొవిడ్ కేసుల పెరిగిపోతుండగా ఐసీయూ బెడ్స్ కొరత తీవ్రంగా కనిపిస్తుందని అధికారులు అంటున్నారు.
వాతావరణం ప్రతికూలంగా మారడంతో పాటు గాలి కాలుష్యంలు ఢిల్లీలో కొవిడ్ మృతులకు కారణంగా మారాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.