Delhi odd-even scheme starts today: Timings, rules, Rs 4 Thousand penalty explained

సరి-బేసి నిబంధన ఉల్లంఘిస్తే భారీ జరిమానా: వారికి మాత్రమే మినహాయింపు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఢిల్లీలో ఆందోళన కలిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోసారి సరి-బేసి వాహన విధానాన్ని అమలు చేస్తోంది. మూడవ సారి అమల్లోకి తీసుకువచ్చిన ఈ సరి-బేసి విధానాన్ని ఉల్లంఘించినవారిపై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ క్రమంలో సరి-బేసి వాహన విధానం నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.4వేలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 

అమలులోకి తీసుకువచ్చిన సరి-బేసి విధానం నవంబర్ 15 వరకు అమలులో ఉండనుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ  విధానం అమలులో ఉంటుంది. ఈ నిబంధనకు ఆదివారాన్ని మినహాయించారు. అలాగే టూ వీలర్స్ ను కూడా మినహాయించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల సీఎంల వాహానాలకు ఈ సరి-బేసి నిబంధనలో మినహాయింపునిచ్చారు.  

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రులు, అధికారుల వాహనాలకు మాత్రం ఈ సరి-బేసి వాహన విధానం నిబంధన వర్తిస్తుంది. సరి-బేసి విధానం ముగిసే వరూ క్యాబ్ డ్రైవర్లు చార్జీలు పెంచవద్దని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానం పర్యవేక్షణ కోసం ప్రభుత్వం 200 ట్రాఫిక్ పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసింది. ఈ విధానంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం 2వేల అదనపు బస్సులను నడుపుతోంది.  మెట్రో రైల్ ద్వారా ప్రతీ రోజు 61 ట్రిప్పులు అదనంగా ప్రభుత్వ బస్సులు ప్రజలకు సేవలందించనున్నాయి. 

Related Posts