కరోనా కాటుకు బలైన ఉత్తమ పోలీసు పతాకాన్ని అందుకున్న ఇన్‌స్పెక్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో కరోనా బారిన‌ప‌డిన‌ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ మృతిచెందారు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్ సెల్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సంజీవ్ కుమార్ యాదవ్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారు. సంజీవ్ యాదవ్ గత 14 రోజులుగా సాకేత్‌లోని మాక్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. విధి నిర్వహణలో చురుగ్గా ఉంటూ అంకిత భావంతో పనిచేసిన సంజీవ్ కు గత జనవరిలో పోలీసు పతకాన్నికూడా అందుకున్నారు. ఇంతలోనే ఇలా కరోనాకాటుకు సంజీవ్ ప్రాణాలు కోల్పోవటంతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది.

14 రోజులుగా సాకేత్‌లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూన్నా ఫలితం లేకపోవటంతో హాస్పిటల్ డాక్టర్లు సంజీవ్ కు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. అది కూడా అతడ్ని ప్రాణాలను నిలబెట్టలేదు. సంజీవ్ మరణం పోలీసు శాఖను కుదిపేసింది.

కరోనా విధి నిర్వహణలో ఉన్న ఆయన ఇలా విగత జీవిగా మారడంతో తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ఎప్పుడూ జోకులేస్తు పని ఒత్తిడిలో కూడా ఎంతో చలాకీగా ఉండే సంజీవ్ మరణాన్ని తోటి సిబ్బంది తట్టుకోలేకపోతున్నారు. అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెడుతున్నారు.
కాగా ఢిల్లీలో కొత్తగా 2,199 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మరణించారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసులు 87,360కు పెరిగాయి. 2,742 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గత 24 గంటల్లో 2,113 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

Read:దుక్కలా ఉండేటోడు, పీనుగులా అయిపోయాడు.. అథ్లెట్ కండలు కరిగించేసిన కరోనా

Related Posts