లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

రైతు మృతికి కారణం అదే..సీసీ ఫుటేజ్ విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు

Published

on

Delhi Police దేశ రాజధానిలో ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉదయం ఢిల్లీలోని ఐటీవో వద్ద ఉత్తరాఖండ్ కి చెందిన నవనీత్ అనే రైతు పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా రైతుల బృందం ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న కవాతులో పోలీసులు రణరంగం సృష్టించినట్లు రైతులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రైతు మృతికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సీసీ ఫుటేజీని విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన ఫుటేజ్ లో.. అతివేగంగా బారికేడ్లవైపు దూసుకొచ్చి ఓ ట్రాక్టర్ పల్టీకొట్టినట్లు కనబడుతోంది. ట్రాక్టర్ పల్టీ కొట్టిన ఘటనలో రైతు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

కాగా, ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్​ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘాలు, వ్యక్తులు నిర్ధరిత మార్గాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. సంఘ వ్యతిరేక శక్తులు ర్యాలీలో చొరబడటం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొంది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

దే