delhi police surprises boxer mary kom family

మేరీకోమ్ ను సర్ ప్రైజ్ చేసిన ఢిల్లీ పోలీసులు: సెల్యూట్ చేసిన మణిపూర్ మణిపూస

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మణిపూర్ మణిపూస..బాక్సింగ్ లో చరిత్ర సృష్టించిన మేరికోమ్ కు ఢిల్లీ పోలీసులు సర్ ప్రైజింగ్ ఇచ్చారు.  ఊహించని రీతిలో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఆ సర్ ప్రైజ్ కు మేరికోమ్ ఉబ్బి తబ్బియ్యారు. 

మేరీ కోమ్ కుమారుడు ప్రిన్స్ కోమ్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీపోలీసులు ఓ కేక్ తీసుకువచ్చి మేరీ కోమ్ కుటుంబ సభ్యులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దానికి మేరీ ఎంతగానో సంతోష పడ్డారు. తన కుమారుడి పుట్టినరోజని తెలుసుకోవటమేకాకుండా ఓ కేక్ కూడా తీసుకోవటంపై ఆమెఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల పెద్ద మనస్సుకు ఆమె చలించిపోయారు.  కదిలిపోయారు. పోలీసుల పెద్ద మనస్సుకు మేరీకోమ్ వారికి సెల్యూట్ చేశారు. 

కరోనాపై ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న యోధులు మీరు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ పాట కూడా పాడడం విశేషం. లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమైన వేళ తమ కుటుంబంలో ఆనందం నింపారంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు, ఏసీపీ ప్రగ్యా ఆనంద్ కు మేరీ కోమ్ మరీ మరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భాన్ని తాను ఎన్నడూ మరచిపోలేనని అంతటి అనుభూతిని కలిగించిన పోలీసులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు మణిపూర్ మణిపూస మేరీకోమ్.పోలీసులు కేక్ తీసుకురావటం..కుమారుడితో కట్ చేయించటం..హ్యాపీ బర్త్ డే పాట పాడి సెలబ్రేట్ చేసిన వీడియోను మేరీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
 

కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పోలీసుల సేవలు ఎవ్వరూ ఎన్నడూ మరచిపోలేనివి. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ముందు నిలిచి కరోనాపై పోరాటం సాగిస్తున్న వీరులుగా అందరి మన్ననలు అందుకుంటున్నారు. అటువంటి పోలీసులకు అందరూ సహకరించాలి. లాక్ డౌన్ ఆంక్షలను అనుసరించాలి. అదే అందరూ పోలీసులకు ఇచ్చే నిజమైన గౌరవం.

Read Here>>తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం…మోడీ తరపున మొదటి పూజ

 

Related Posts