లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ప్లాస్టిక్‌ జాతీయ జెండా ఉపయోగించొద్దు : కేంద్రం హోంశాఖ కీలక ఆదేశాలు..పాటించకుంటే కఠిన చర్యలు

Updated On - 1:06 pm, Sat, 23 January 21

Republic Day 2021..key directives on national flag : జనవరి 26. దేశ గణతంత్ర దినోత్సవ దినోత్సవం. దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండా విషయంలో కీలక సూచనలు చేసింది.

దేశ పౌరులెవరూ ప్లాస్టిక్‌తో తయారుచేసిన జాతీయ జెండాలను ఉపయోగించవద్దని సూచించింది. కరోనా కాలంలో గణతంత్ర వేడుకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టూ నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌ 1971, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా(2002) ప్రకారం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం హోంశాఖ.

ప్లాస్టిక్ తో చేసిన జెండాలు ఉపయోగించవద్దని సూచించింది. అలాగే కాగితాలతో తయారుచేసిన జాతీయ జెండాల వాడకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేలా సాముహిక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడే విధంగా వాటిని ఎలా డిస్పోజల్ చేయాలో తెలిపే సరైన మార్గాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని కోరింది. వేడుకలు ముగిసిన తరువాత జెండాలను ఎక్కడ పడితే అక్కడ పారేయవద్దని హోం శాఖ ఆదేశించింది.

జెండాను అవమానించే రీతిలో ప్రవర్తించవద్దని సూచించింది. మన జాతీయ జెండా..మువ్వన్నెల జెండా దేశ ప్రజల ఆశయాలకు, ఆశలకు ప్రతిరూపమని అటువంటి జెండాలను అవమానించేలా చేయవద్దని హోంశాఖ పేర్కొంది. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల సందర్భంగా కాగితపు జెండాల స్థానంలో ప్లాస్టిక్‌తో తయారుచేసిన జాతీయ జెండాలను వినియోగిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని..కాబట్టి ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించవద్దని హోం మంత్రిత్వ శాఖ కోరింది. కాగితంలా ప్లాస్టిక్‌కు వీటికి మట్టిలో కలిసిపోయే గుణం లేదని పేర్కొంది.

ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టూ నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌ 1971 ప్రకారం.. బహిరంగంగా కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని అగౌరవ పరిచేలా వ్యవహరించిన, అగౌరవ పరిచే విధంగా మాట్లాడినా.. జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. లేదా జరిమానాతో పాటు జైలుశిక్షకూడా అమలు చేస్తారు. కాబట్టి దేశ పౌరులంతా జాతీయ జెండా గౌరవాన్ని ఇనుమడించేలా వ్యవహరించాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోను జెండాకు అవమానం జరిగేలా వ్యవహరించకూడదని ఆదేశించింది.