లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

రాక్షసుడిలా కనిపిస్తున్నాడు : మహిళ పొట్ట చీల్చి అవయవాలు తీసివేసిన హత్యకేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Published

on

Delhi supreme court : ఇతను అసలు మనిషేనా? ఇతను చేసిన ఘోరం గురించి వింటుంటే ఇతను రాక్షసుడిలా కనిపిస్తున్నాడంటూ సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీంకోర్టు ఓ నిందితుడి విషయంలో వ్యాఖ్యానించింది. ఓ మహిళను అత్యంత పాశవికంగా పొట్ట చీల్చి..లోపలి అవయవాలను బైటకు తీసేసి పొట్టలో ఓ బట్టను కిక్కు తిరిగి వైరల్లతో కుట్టేసిన అత్యంత కిరాతకానికి పాల్పడిన కేసులోని నిందితుడి గురించి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది…!


ఈ కేసులోని నిందితుడికి కిందికోర్టు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులోని తదుపరి వాదనలు పూర్తయ్యేంత వరకు మరణశిక్షను నిలుపుదల చేసేలా బుధవారం (అక్టోబర్ 28,2020)ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును విచారిస్తున్న సందర్భంగా సీజేఐ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్యాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇటువంటి కేసును మేమెప్పుడూ చూడలేదు. ఈ కేసులో నిందితుడు మనిషిలా కాదు మనిషి రూపంలో ఉన్న ఓ రాక్షసుడిలా అనిపిస్తున్నాడు’’అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.


భర్తతో విడిపోయినా, కోడలికి అత్తారింటిలో ఉండే హక్కు ఉంది


కేసు వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ లో ఓ బిల్డింగ్‌ కాంప్లెక్సులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే మోహన్‌ సింగ్‌ అనే వ్యక్తి 2019లో ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆమె పొట్టను చీల్చి, అవయాలను బయటకు తీశాడు. ఆ తరువాత ఓ పెద్ద బట్టను కుక్కి, సూది..వైరుతో కుట్లు వేశాడు. ఆ తరువాత తన నేరం ఎవ్వరికి చిక్కకూడదనే ఆలోచనతో ఆధారాలు మాయం చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికపోయాడు.


ఈ క్రమంలో పోలీసులు మోహన్‌ సింగ్‌ను అరెస్టు చేసారు. అనంతరం ఆ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి ట్రయల్స్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసుని విచారించిన న్యాయస్థానం అనేక పరిణామాలుగా కొనసాగిన విచారణ అనంతరం మోహన్ సింగ్ ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ట్రయల్స్ కోర్టు విధించిన మరణశిక్షను రాజస్థాన్‌ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థిస్తూ గత ఆగష్టు 9,2020న శిక్ష ఖరారు చేసింది. ఈ క్రమంలో దోషిగా తేలిన మోహన్ సింగ్ తరఫు న్యాయవాది..సీనియర్‌ అడ్వకేట్‌ అయిన సిద్ధార్థ్‌ లూత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషికి ఉరిశిక్షను నిలిపివేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు.


ఈ కేసులో మోహన్ సింగ్ చేసిన కిరాతకపు..హేయమని నేరాలను విన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రాతో ‘‘మీ క్లైంట్‌ చాలా హేయమైన చర్యకు పాల్పడ్డాడు..ఆమెను అతడు అంత కిరాతకంగా పొట్ట చీల్చి అందులో వస్త్రాలు పెట్టాడు? అతడేమైనా సర్జనా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.


దీనికి సమాధానంగా సిద్ధార్థ్ లూత్రా మోహన్‌ సింగ్‌ను ఈ కేసులో కావాలనే ఇరికించారని..గతంలో అతనిపై ఓ హత్యకేసులో దోషింగా ఉన్నందున అతనిపై ఈ నేరాన్ని మోపారని అంతేతప్పా తన క్లైంట్ ఈ హత్య చేయలేదని బదులిచ్చారు.


హత్యకు గురైన మృతురాలు చివరిసారిగా తన క్లైంట్ అయిన మోహన్ సింగ్ తో మాట్లాడిందన్న ఒకే ఒక్క కారణంతో అతడే హత్యకు పాల్పడ్డాడన్న నిర్ధారణకు సరైంది కాదని తెలిపారు. అంతేగాక, ఈ కేసులో డీఎన్‌ఏ ఎక్స్‌పర్ట్స్‌ ఇంతవరకు విచారణకు హాజరురాలేదని, ఘటనాస్థలంలో గల సీసీటీవీ రికార్డులను కూడా పోలీసులు ఇంతవరకు కోర్టుకు సమర్పించలేదని చెప్పారు.ఈ క్రమంలో సరైన ఆధారాలు సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ, అప్పటివరకు మోహన్‌సింగ్‌ ఉరిశిక్షపై స్టే విధిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *