Home » క్రాకర్స్ నిషేధంపై పిటిషన్ : పండుగల కంటే ప్రజల జీవితాలే ముఖ్యం : సుప్రీంకోర్టు
Published
2 months agoon
By
nagamaniDelhi supreme court ban on firecrackers : దీపావళి పండుగ వచ్చిందంటే చాలు పటాసులు ఢాం ఢాం అని పేలుతుంటాయి. పటాసులు కాల్చుకోవటం వేడుకే కానీ అంతకు మించి ప్రజలు ఆరోగ్యం..వారి జీవితాలు చాలా ముఖ్యం అని దేశ అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
దీపావాళికి బాణసంచా కాల్చటంపై నిషేధం విధించడాన్ని సవాల్‌చూస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రజల జీవితాలు..వారి ఆరోగ్య భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజలు పండుగలు జరుపుకోవడం..ఆనందంగా ఉండటం ముఖ్యమే..కానీ పండుగల కంటే ప్రజల జీవితాలు ఇంకా ముఖ్యమైనవనీ వెల్లడించింది. పండుగల వేళ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో వారి వారి భవిష్యత్తుల్లో అంతకంటే ముఖ్యమని తెలిపింది.
భారతదేశంలో పండుగలు ప్రజల జీవితాల్లో ఎంత ప్రాముఖ్యత కలిగినవో మన అందరికీ తెలుసు..అయితే ప్రస్తుతం మనం కరోనా వైరస్‌తో దేశమంతా పోరాడుతోందనీ దేశ ప్రజలు కరోనాతో చాలా ఇబ్బందులు పడుతున్నాయనీ.. ప్రాణాలు కూడా కోల్పోతున్న విషయాన్ని మరచిపోకూడదని సూచించింది.
వేడుకలు మనిషి జీవితంలో భాగం..అలాగనే ఆరోగ్యానికి హాని కలిగించే వేడుకలకు తాత్కాలింకగా దూరంగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మరచిపోకూడదని గుర్తు చేసింది ధర్మాసనం.
కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతున్న ఈ సమయంలో పరిస్థితిని మెరుగుపర్చడానికి తీసుకునే నిర్ణయాలకు ప్రజలంతా కలిసికట్టుగా మద్దతు నిలువాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సూచించారు.
‘పండుగలు చాలా ముఖ్యం అనే సంగతి మాకు తెలుసు. కానీ ప్రజల ప్రాణాలు ఆపదలో ఉన్నప్పుడు వారిని కాపాడుకోవడం కోసం ఏదో ఒక ప్రయత్నం తప్పక జరుగుతుండాలి. అటువంటి ప్రయత్నాలకు అందరూ సహకరించాలి’ అని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు.
పశ్చిమబెంగాల్లో క్రాకర్స్‌పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఉదయం ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను తోసిపుచ్చుతూ పై వ్యాఖ్యలు చేసింది. ప్రజలు కరోనా కష్టాలు పడుతున్న సమయంలో ప్రతీ ఒక్కరూ సమన్వయం పాటించి క్రాకర్స్ కాల్చే విషయంలో ఆలోచించాలని సూచించింది.