లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

టాటా గ్రూప్ స్టార్టప్ : డీజిల్ డోర్ డెలివరీ

Published

on

Delhi : Tata Diesel Door Delivery : కారులో డిజిల్ కొట్టించుకోవాలంటే బంక్ కు వెళ్లాలి. కానీ ఇకనుంచి డీజిల్ డోర్ డెలివరీ కానుంది. సరుకుల్ని డోర్ డెలివరీ ఇచ్చినట్లుగా ఇకనుంచి డీజిల్ కూడా డోర్ డెలివరీ కానుంది. రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ త్వరలో స్టార్టప్‌ను ప్రారంభించబోతున్నారు.రెపోస్ ఎనర్జీ ద్వారా అవసరమైన డీజిల్‌ను ఇంటికే డెలివరీ చేయడానికి ఈ స్టార్టప్ ను మొదలుపెట్టారు టాటా గ్రూప్. దేశంలోని పలు నగరాల్లో ఈ డోర్ డెలివరీలు అందుబాటులోకి రానున్నాయి. స్టార్టప్ ఆపరేటింగ్ డోర్-టు-డోర్ డీజిల్ డెలివరీ, చమురు మార్కెటింగ్ సంస్థల సహకారంతో ఢిల్లీ, గుర్గావ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌లో తన సేవలను ప్రారంభించింది.పూణేకు చెందిన టాటా సంస్థ డైరెక్టర్లు చేతన్‌, అధితి భోస్లే మొబైల్‌ పెట్రోల్ పంపుల ద్వారా డీజిల్‌ను ఇంటికి డెలివరీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ స్టార్టప్ 3,200 రెపోస్‌ మొబైల్ పెట్రోల్ పంపులను తయారు చేయాలనేది స్టార్టప్‌ ప్రణాళిక.
రెపోస్ ఎనర్జీ స్టార్టప్ 2016లో ప్రారంభించారు. అప్పటి నుంచి రెపోస్ ఎనర్జీ సుమారు 130 నగరాల్లో 300 రెపోస్ మొబైల్ పెట్రోల్ పంప్ (ఆర్‌ఎంపీపీ) ద్వారా సేవలను అందిస్తోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *