లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఢిల్లీ యూనివర్శిటీ VCని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి

Published

on

Delhi University vice chancellor Yogesh Tyagi suspended by President ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ త్యాగిని సస్పెండ్ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. తనకున్న అధికారాలను ఉపయోగించి యోగేష్ త్యాగిని సస్పెండ్ చేసిన రాష్ట్రపతి..తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అంతేకాకుండా, విధులను సక్రమంగా నిర్వహించడంలేంటూ యోగేష్ త్యాగిపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణకు ఆదేశించారు రామ్ నాథ్ కోవింద్. 2016 మార్చి-10న ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా యోగేష్ త్యాగి నియమితులయ్యారు. కొద్దిరోజులగా యూనివర్శిటీలో అధికారం కోసం గొడవ జరగుతున్న సమయంలో రాష్ట్రపతి ఇవాళ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.కాగా, వైస్ ఛాన్సలర్ యోగేష్ త్యాగి విశ్వవిద్యాలయాన్ని (చట్టబద్ధమైన) నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం లేదు. ఇది…ఢిల్లీ విశ్వవిద్యాలయ దుర్వినియోగం(mis-governance) మరియు సక్రమంగా పనిచేయకపోవటానికి కారణమైంది. ఇది విశ్వవిద్యాలయం యొక్క సరైన విద్యా మరియు పరిపాలనా వాతావరణానికి అనుకూలంగా లేదు అని ఓ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యోగేష్ త్యాగిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ న్యాయబద్ధంగా జరగాలని…మెటీరియల్ రికార్డులను తారుమారు చేయడం,సాక్ష్యులను తన అధికారాన్ని ఉపయోగించుకొని భయపెట్టడం వంటి చర్యలకు యోగేష్ త్యాగి పాల్పడకుండా ఉండేందుకు రాష్ట్రపతి ఆయనను సస్పెండ్ చేయడం జరిగిందని ఓ మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యోగేష్ త్యాగి..అనారోగ్యకారణాలతో సెలవుపై ఉన్న సమయంలో జారీ చేయబడిన లేదా ఆయన ఆమోదంతో జారీ చేసిన అన్ని ఆదేశాలను పక్కనబెట్టడం జరిగిందని తెలిపారు. ఆ ఆదేశాలు చెల్లనివిగా ఉంటాయని తెలిపారు.అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన జులై-2నుంచి యోగేష్ త్యాగి సెలవులో ఉన్నారు. త్యాగి తన ఉద్యోగానికి తిరిగివచ్చేవరకు ఆయన నిర్వహిస్తున్న వైస్ ఛాన్సలర్ బాధ్యతలను ప్రొ-వైస్ చాన్సలర్ పీసీ జోషికి జులై-17న కేంద్రప్రభుత్వం అప్పగించింది. అయితే, గత గురువారం యోగేష్ త్యాగి…పీసీ జోషిని ప్రొ-వైస్ ఛాన్సలర్ గా తొలగించి ఆయన స్థానంలో వేరొకరిని నియమించడం వివాదానికి దారితీసింది.మరోవైపు, గత బుధవారం పీసీ జోషి.. కొత్త రిజిస్ట్రార్ గా వికాస్ గుప్తా నియామకాన్ని నోటిఫై చేశారు. వికాస్ గుప్తా.. ఇంటర్వ్యూ అప్పటికే పూర్తి చేసుకొని..బుధవారం రోజే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆయన నియామకానికి ఓకే చెప్పేసింది. అయితే అదేరోజు యోగేష్ త్యాగి…రిజిస్ట్రార్ గా పీసీ జా అనే వ్యక్తి నియామకాన్ని నోటిఫై చేసి ఆమోదించారు. దీంతో వైస్ ఛాన్సలర్-ప్రొ వైస్ ఛాన్సలర్ మధ్య నెలకొన్న అధికార జగడంలో విద్యామంత్రిత్వశాఖ జోక్యం చేసుకొని…త్యాగి సెలవుపై ఉన్నందున నియామకాలపై ఆయన తీసుకున్న నిర్ణయాలు చెల్లనివిగా పేర్కొంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *