Delhi violence reminder of 2002 Gujarat riots

ఢిల్లీ కల్లోలాలు ఎందుకు 2002 గుజరాత్ మతఘర్షణలను గుర్తుకుతెస్తున్నాయి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వారాలుగా సీఏఏ వ్యతిరేకులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నారు. అలలు అలలుగా కొత్త వాళ్లు వస్తూనే ఉన్నారు. ప్రభావం దేశమీదా పడింది. సహజంగానే బీజేపీకి, సిఏఏ అనుకూల వర్గాలకు ఇది నచ్చలేదు. ప్రతిగా, సిఏఏ అనుకూల ర్యాలీలు మొదలైయ్యాయి. షహీన్ బాగ్ నుంచి నిరసనకారులను తప్పించాలంటూ బీజేపీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.  ఈ రెండు వర్గాల మధ్య చిన్నచిన్న ఘర్షణలు కాస్తా పెరిగి, మతకల్లోల్లాగ మారాయి.

సాయుధ గుంపులు ఎలాంటి భయంలేకుండా నినాదాలు చేస్తూ తిరుగుతుంటే పోలీసులు వాళ్ల జోలికెళ్లినట్లు కనిపించలేదు. మసీదులు, దుకాణాలు, ఇల్ల మీద గుంపులు దాడులు చేస్తుంటే అడ్డుకొనేవాళ్లు లేరు. ఒకపక్క, ట్రంప్ ఆతిథ్యంకోసం ప్రభుత్వ పెద్ద తహతహలాడిపోతుంటే 20కిలోమీటర్లకు ఇటువైపు కల్లోలాలను అడ్డుకొనేవాళ్లేలేరు. కొన్నిచోట్ల పోలీసులకే గంపులను ప్రోత్సహించాయన్న ఆరోపణలూ ఉన్నాయి. దుకాణాలను దోచుకొన్నారు. తగలబెట్టారు. నీమతమేంటని అడిగారు. అల్లర్లలకు సంబంధించిన వీడియోలు, ఫోటు బైటకొచ్చి ఢిల్లీ అసలు గుట్టును బైటపెట్టాయి. కొన్నిచోట్ల ముస్లింలను జాతీయ గీతం ఆలపించాల్సిందిగా ఒత్తిడితెచ్చారు. కొందరిని చావగొట్టారు. భయంతో చాలా ముస్లిం కుటుంబాలు దూరంగా వెళ్లిపోయారు.

మరణాలు 20కి మించడంతో దేశవ్యాప్తంగా గగ్గోలు, మూడురోజుల తర్వాత ప్రధాని ట్వీట్ చేశారు. శాంతికోసం పిలుపునిచ్చారు. అలాగని బాధితుల గురించి మాట్లాడలేదు. మూడోసారి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అల్లర్ల అదుపుచేయాలంటూ హోంమంత్రికి విన్నవించడం తప్ప మరేం చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయాయి. అసలు ఢిల్లీ అల్లర్లకు కారణం పోలీసుల వైఫల్యమంటూ ఇంటాబైటా విమర్శలు. కళ్లముందే అల్లర్లు సాగుతుంటే పట్టించుకోలేనది జనమూ తిట్టిపోస్తున్నారు. ఏదైతేనేం అల్లరి మూకలకు జనాలను వదిలేశారు.

ఢిల్లీ హైకోర్టు కూడా 1984నాటి పరిస్థితి రాకుండా అడ్డుకొంటామనికూడా చెప్పింది. విపక్షమేమో 2002నాటి గుజరాత్ మత కల్లోలాలను గుర్తుకు తెచ్చేలా… ఒక ప్రొగ్రామ్ మాదిరి ఢిల్లీలో అల్లర్లకు పాల్పడ్డారని ఆరోపించింది. ఇంతకీ ఈ ప్రొగ్రామ్ ఏంటి? అల్లర్లురేగుతున్నా పోలీసులు పట్టించుకోరు. విధ్వంసాన్ని సృష్టిస్తున్నా, దాడులు చేస్తున్నా చూడనట్లే ఉంటారు. కొన్నిసార్లు వాళ్లే అల్లరిమూకలకు సాయం చేస్తారు. మూడురోజులుగా పోలీసుల ధోరణి ఇలానే ఉందన్నది కాంగ్రెస్ ఆరోపణ.

ఈఅల్లర్లకు బీజం ఢిల్లీ ఎన్నికల్లోనే పడింది. బీజేపీనేతలు బహిరంగంగానే మతపరంగా ఓటర్లను విభజించి మాట్లాడారు. పట్టిష్టమైన యంత్రాంగమున్న పార్టీ విద్వేషరాజకీయాలకు పాల్పడేసరికి అనుమానం, ఏదో జరగబోతోందన్న పారనోయా ఎర్పడిందని రాజకీయ విశ్లేషకులూ అంటున్నారు.

ఢిల్లీ ఎన్నికలకు ముందుగానే బీజేపీ సిఏఏ నినాదాన్ని గట్టిగా ఎత్తుకుంది.  ప్రచారంలో సిఏఏ, కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని తొలగించడం,  రామజన్మభూమిలో గొప్ప ఆలయాన్ని కట్టడం వంటి అంశాలనే
ప్రచారంచేస్తూ వచ్చింది. కనీసం రెండువందల మంది ఎంపీలు, మంత్రులు, పార్టీ నేతలు వచ్చి ఢిల్లీ మీద వాలిపోయారు. ప్రతివీధిలోనూ బీజేపీ నేతల ప్రచారమే. దానికితోడు గీతదాటి మరీ కామెంట్స్ వచ్చాయి.  విద్వేషపూరిత ప్రసంగాలను ఎన్నికల సంఘం ఎడిట్ చేయాల్సిందివచ్చింది. ఇక ఢిల్లీ దృష్టంతా షహీన్ బాగ్ లో సిఏఏకి వ్యతిరేకంగా సాగుతున్న మహిళల నిరసన మీదనే. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువ. అందుకే బీజేపీ ఈ ప్రాంతాన్నే టార్గెట్ చేసింది. నిరసనకారులు దేశద్రోహులుగా ముద్రవేసింది.

ఈపరిస్థితిలో ఢిల్లీ మతసామరస్యత కుప్పకూలిపోయేలాగే కనిపించింది. ఈ భయాన్ని నిజంచేస్తూ ఆదివారం బీజేపీ లీడర్ ఏకంగా ఢిల్లీ పోలీసులకే హుకుం జారీచేశాడు. మీకిచ్చేది మూడురోజులే. ఈలోగా నిరసనకారులను తరమివేయండి. లేదంటే మేం చూసుకొంటామని అన్నాడు. మరుసటిరోజు నుంచే అల్లర్లు మొదలైయ్యాయి. రెండోరోజు విధ్వంసకాండ.

Related Posts