-
Home » IPL 2020 DC vs KKR: ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కత్తాపై ఢిల్లీ విజయం
IPL-2020
IPL 2020 DC vs KKR: ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కత్తాపై ఢిల్లీ విజయం
Published
5 months agoon
By
vamsi
రెండు వికెట్లు కోల్పోయిన కోల్కత్తా..
03/10/2020,10:19PM229పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్‌లోనే నరైన్ వికెట్ కోల్పోయినా కూడా నిలకడగా నిలబడి ఆడారు. అయితే 8వ ఓవర్లో అమిత్ మిశ్రా వేసిన ఫస్ట్ బంతికే శుబ్మాన్ గిల్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తం 8.1ఓవర్లకు కోల్కత్తా 2వికెట్లు నష్టపోయి 72పరుగులు చేసింది.
మైదానంలో మెరుపులు.. కోల్కత్తా టార్గెట్ 229
03/10/2020,9:36PMషార్జా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసి కెకెఆర్‌కు 229 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేయగా.. పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయాస్ అర్ధ సెంచరీలు చేశారు. పృథ్వీ షా 66 పరుగులు చెయ్యగా.. శ్రేయాస్ 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ 26 బంతుల్లో యాభై పరుగుల మార్కును చేరుకోగా.. ఐపిఎల్‌లో తన వేగవంతమైన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శిఖర్ ధావన్ 26, రిషబ్ పంత్ 38 పరుగులు చేశారు. ఆండ్రీ రస్సెల్ 2, వరుణ్ చక్రవర్తి, కమలేష్ నాగర్కోటి కెకెఆర్ తరపున చెరొక వికెట్ తీసుకున్నారు.
దూకుడుగా మొదలెట్టి నిదానంగా ఆడుతున్న ఢిల్లీ
03/10/2020,8:14PM ఐపిఎల్ 2020 16వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మైదానం చాలా చిన్నది కావడంతో.. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే కాసేపటికే దావన్ అవుట్ అవడంతో కాస్త నెమ్మదిగా ఆడుతుంది. 8ఓవర్ల టైమ్ అవుట్ ముగిసేసరికి 75పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్.
టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తున్న కోల్కత్తా
03/10/2020,8:00PMIPL 2020 DC vs KKR: ఐపిఎల్ 2020లో 16వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. షార్జాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది.
ఈ మైదానం చాలా చిన్నది కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం కోల్‌కతా జట్టులో మార్పు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు బదులుగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠికి అవకాశం లభించింది.
టాస్ తర్వాత కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయబోతున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ, మేము కూడా మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాము. వికెట్ అద్భుతంగా ఉంది. కాబట్టి మొదట బ్యాటింగ్ చేయడం కూడా ఆనందంగానే ఉంది అని అన్నారు.
You may like
-
అందమైన అమ్మాయిలతో మాసాజ్ పేరుతో పిలిచి రూ.55 లక్షలు దోచేశారు
-
ఐపీఎల్ వేలం..164 మంది ఇండియన్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు
-
చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్
-
ఎన్నారై ఉదారత : ఉద్యోగుల భార్యలకూ వేతనాలు
-
పురీష నాళంలో బంగారం, అవాక్కయిన అధికారులు
-
నితిన్ అస్సలు ఆగట్లేదు..వరుస సినిమాలతో బిజీ బిజీ

ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు

బాబు కుప్పం పర్యటన ఆంతర్యమేంటి?

కేరళ ట్రైన్లో పేలుడు పదార్ధాలు.. టార్గెట్ ఎవరు ?

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ

తమిళనాడులో వరుసగా బాణసంచా పేలుళ్లు.. గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో స్టార్స్ సందడి!

పరువాల పూనమ్ బజ్వా ఫొటోస్

‘ఉప్పెన’ సక్సెస్ సెలబ్రేషన్స్..

అనన్య నాగళ్ల ఫొటోస్

ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడులు

బాబు కుప్పం పర్యటన ఆంతర్యమేంటి?

కేరళ ట్రైన్లో పేలుడు పదార్ధాలు.. టార్గెట్ ఎవరు ?

భారత్ బంద్
