ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం : బాణాసంచా నిషేధాన్ని పట్టించుకోని జనాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Delhi’s air quality turns severe : దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. బాణాసంచా నిషేధంపై ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోలేదు ఢిల్లీ వాసులు. 2020, నవంబర్ 14వ తేదీ శనివారం దీపావళి పండుగ సందర్భంగా రాత్రి జనాలు టపాసులు కాల్చారు. దీంతో ఆదివారం అత్యంత ప్రమాదకరస్థాయికి కాలుష్యం చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 450 పాయింట్లకు పైగా నమోదైంది. పొగమంచు, కాలుష్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పరిస్థితులు మరింత విషమం : –
దేశ రాజధాని రాజధాని ఢిల్లీలో పరిస్ధితులు నానాటికీ విషమిస్తున్నాయి. ఇప్పటికే వాయు కాలుష్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతూ ఉండగా.. దీపావళి వేడుకల సందర్భంగా పరిస్ధితి మరింత తీవ్రంగా మారింది. దీంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్య తీవ్రత పెరగడంతో.. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు రంగంలోకి దిగారు. అర్థరాత్రి వేళ వాటర్‌ను స్ప్రే చేసి.. పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం నిషేధించినా ప్రజలు పెద్దసంఖ్యలో బాణాసంచా కాల్చారు.పొల్యూషన్ భయం : –
దీపావళి వస్తే చాలు.. దేశ రాజధానిని పొల్యూషన్‌ భయం పట్టుకుంటోంది. ఢిల్లీ సమీప రాష్ట్రాల్లోని పంట వ్యర్థాలను తగులబెట్టడం, నిర్మాణ ప్రాంతాల నుంచి వస్తున్న కాలుష్యం ఢిల్లీని చుట్టేస్తోంది. తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న హస్తినను.. బాణాసంచా కాలుష్యం మరింత వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం దీపావళి రోజు వాయి కాలుష్య సూచీ 281గా నమోదైంది. శనివారమే ఉదయానికే 369 పాయింట్లకు.. వాయుకాలుష్యం చేరడం ఢిల్లీలో కాలుష్య పరిస్ధితి తీవ్రతను సూచిస్తోంది.కేంద్రం హెచ్చరికలు : –
దీపావళి వేడుకల సందర్భంగా వాయుకాలుష్యం మరింత ప్రమాదకర స్ధాయికి చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం ముందునుంచే హెచ్చరిస్తూ వస్తోంది. బాణాసంచా కాల్చడంతో కాలుష్య తీవ్ర మరింత పెరగవచ్చనే అంచనాలను కేంద్ర భూగర్భమంత్రిత్వశాఖ వెలువరించింది. దట్టమైన పొగతో పాటు టపాసులు పేల్చడం ద్వారా వెలువడే కాలుష్యంతో పరిస్ధితి తీవ్రంగా మారొచ్చని కేంద్రం చెప్పింది. అన్నట్లుగానే.. పరిస్థితి ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.

Related Tags :

Related Posts :