With the demise of Arun Jaitley Ji, I have lost a valued friend: PM Modi

విలువైన మిత్రుడిని కోల్పోయాం : జైట్లీ మృతిపై మోడీ దిగ్భ్రాంతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జైట్లీ మరణవార్త వినగానే పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 9న ఎయిమ్స్ లో చేరారు. అప్పటి నుంచి అక్కడే జైట్లీ చికిత్స పొందుతూ శనివారం (ఆగస్టు 24) కన్నుమూశారు. ఆయన మృతితో రాజకీయ ప్రముఖులంతా ట్విట్టర్ వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 

జైట్లీ సేవలు మరువలేం : సురేశ్ ప్రభు
జైట్లీ మృతిపై పార్టీ నేత, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు విచారం వ్యక్తం చేశారు. జైట్లీ మంచి స్నేహితుడు, లీగల్ బ్రెయిన్, షార్ప్ మైండ్, వ్యూహాత్మకర్త, ఎన్నోఏళ్ల రాజకీయ మిత్రుడిగా ఆయన చేసిన సేవలను ఎన్నటికి మరువలేనివని అన్నారు. 

దేశ రాజకీయాల్లో జైట్లీ సహకారం గుర్తుండి పోతుంది : మమతా బెనర్జీ
జైట్లీ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి విచారకరమన్నారు. పార్లమెంటరీ సభ్యునిగా, తెలివైనా న్యాయవాదిగా పార్టీలన్నీ ఎంతో మెచ్చుకున్నాయి. భారతీయ రాజకీయాల్లో జైట్లీ చేసిన విశేష కృషి ఎప్పటికి గుర్తుండిపోతుంది. జైట్లీ భార్య, ఆయన పిల్లలు, స్నేహితులకు నా సంతాపం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. 

కుటంబ సభ్యున్ని కోల్పోయాను : అమిత్ షా 
జైట్లీ మరణం ఎంతో బాధించింది. వ్యక్తిగతంగా నాకెంతో నష్టం లాంటిది. ఒక సీనియర్ పార్టీ నేతను మాత్రమే కోల్పోలేదు.. ఎప్పటికీ నాకు మార్గదర్శిగా ఉండే ముఖ్యమైన కుటుంబ సభ్యునిగా కూడా కోల్పోయాను. 

ప్రభుత్వానికి జైట్లీనే ఆస్తి : రాజ్ నాథ్ సింగ్
అరుణ్ జైట్లీ మృతిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా జైట్లీ మృతిపై సంతాపం ప్రకటించారు. ఒక నేతగా మాత్రమే కాకుండా తన శక్తి సామర్థ్యాలతో దేశానికి సేవలందించారు. పార్టీ సంస్థకు, ప్రభుత్వానికి జైట్లీ ఆస్తి లాంటి వాడని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. రోజులో సమస్యలను లోతుగా అర్థం చేసుకునేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఆయన విజ్ఞానం, కలుపుకోలుతనమే ఎంతమంది స్నేహితులను గెలుచుకునేలా చేసింది అని ట్వీట్ చేశారు. 

విలువైన మిత్రుడిని కోల్పోయా : పీఎం మోడీ
అరుణ్ జైట్లీ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన విలువైన స్నేహితుడిని కోల్పోయానని బాధపడ్డారు. దశబ్దకాలంగా తెలిసిన ఎంతో గౌరమైన వ్యక్తి, రాజకీయ దిగ్గజం మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఎంతో బాగా జీవించారు. మా అందరికి మధుర క్షణాలను వదిలేసి వెళ్లిపోయారు. జైట్లీ తామంతా మిస్ అవుతున్నామని విచారం వ్యక్తం చేశారు. 

Related Posts