లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

మూగజీవాల్ని చంపి పాతిపెట్టిన అధికారులు..బైటపడుతున్న కళేబరాల గుట్టలు

Published

on

Denmark Officers Minks Carcasses Tension: డెన్నార్క్ లో మూగజీవాలైన మింక్ జంతువులను చంపి పాతిపెట్టిన ఘటనలు అధికారుల్ని ఇప్పుడు కలవరపరుస్తున్నాయి. మింక్ ల వల్లనే కరోనా మనుషులకు సోకుతోందనే కారణంతో డెన్మార్క్ దేశ వ్యాప్తంగా లక్షలాది మింక్ లను ప్రభుత్వ అనుమతితో అధికారులు చంపించి భూమిలో పాతి పెట్టారు. ఈ క్రమంలో నేలలోంచి మింక్ ల కళేబరాలు బైటపడుతున్నాయి. దీంతో అధికారులకు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. నేల వదులుగా ఉన్న ప్రాంతాల్లో మింక్ ల కళేబరాలు బైటపడటంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.కాగా..డెన్నార్క్ లో మింక్ అనే జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుండడంతో డెన్మార్క్ ప్రభుత్వం ఇటీవల లక్షలాది మింక్‌ల‌ను చంపించి భూమిలో పాతిపెట్టింది. ఇలా పాతిపెట్టిన మింక్‌ల కళేబరాలు తిరిగి భూమిపైకి బైటపడుతుండటంతో అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. మింక్‌ల ద్వారా పరివర్తన చెందిన కరోనా వైరస్ తిరిగి మానవుల్లోకి ప్రవేశిస్తోంది. పరివర్తన చెందిన ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో డెన్మార్క్ ప్రభుత్వం లక్షలాది మింక్‌లను హతమార్చింది.రూ.500ల బిల్లుకి రూ.2 లక్షలు టిప్పు ఇచ్చిన కష్టమర్..


అలా హతమార్చిన మింక్ ల కళేబరాలను భూమికి 2.5 మీటర్ల లోతు, 3 మీటర్ల వెడల్పు కలిగిన గుంతల్లో వేసి..వాటిపైన సుద్ద పొడి వేసి పొరలు పొరలుగా పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో నేల వదులుగా..గుల్లగా ఉండే ప్రాంతాల్లో భూమి పొరల్లో ఉన్న కళేబరాలు బయటకు పొడుచుకు వస్తున్నాయి. దీంతో కంగారు పడిన అధికారులు వాటిని పరిశీలించగా, వాటి కళేబరాలు భూమిలో కలిసే సమయంలో కళేబరాల అంతర్భాగాల్లో గ్యాస్ చేరడమే ఇందుకు కారణమని తేల్చారు.ఇలా బయటకు పొడుచుకొచ్చిన వాటిని బయటకు తీసి నేల గట్టిగా ఉన్న ప్రాంతాలకు తరలించి పూడ్చిపెడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ పని మొత్తం పూర్తయ్యే వరకూ ఆయాప్రాంతాల్లోకి నక్కలు, పక్షులు వంటివి చేరకుండా ఉండేందుకు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈక్రమంలో కొన్ని ప్రాంతాల్లో పక్షులు,నక్కలు, కుక్కలు వంటివి మింక్ ల శరీరాలనుతింటున్నట్లుగాను..అలా కొన్ని అవశేషాలను పలు ప్రాంతాల్లో పడేస్తున్నాయని దీని వల్ల కరోనా వైరస్ ప్రభలే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తగిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా..వచ్చే ఏడాది చివరి వరకు మింక్ ఫారాలు నిర్వహించకుండా డెన్మార్క్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *